మనల్ని చూసి ఇంటింటికీ నీరిస్తామని నితీష్ చెబుతున్నారు: కెసిఆర్

హైదరాబాద్: ఇంటింటికీ మంచినీరు అందించే మన వాటర్ గ్రిడ్ పథకాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శప్రాయంగా తీసుకుంటున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణలో మాదిరిగా బీహార్‌లో ఇంటింటికీ మంచినీరు అందించే పథకం చేపడుతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అక్కడి ప్రజలకు హామీ ఇస్తున్నారని ఆయన చెప్పారు.

Nitish Kumar is praising our water grid: KCR

వరంగల్ జిల్లా నాయకులతో ఆయన శనివారం సాయంత్రం సమావేశమై ప్రసంగించారు. మన వాటర్ గ్రిడ్ పథకం నచ్చి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మన మంత్రిని పిలిపించుకున్నారని చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా మనలను సంప్రదిస్తోందని ఆయన చెప్పారు.

ఏ పార్టీ అయినా ఎవరో ఒకరినే అభ్యర్తిగా ఎంచుకుంటుదని, మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నవారికి అవకాశాలు వస్తాయని ఆయన చెప్పారు. వరంగల్ లోకసభ అభ్యర్థిగా ఎంపికైన పసునూరి దయాకర్ తెలంగాణ తల్లి రూపశిల్పి అని ఆయన చెప్పారు. విద్యాధికుడు, ప్రజలకు అందుబాటులో ఉంటారని, అందరి మద్దతుతోనే దయాకర్‌ను అభ్యర్థిగా నిర్ణయించామని ఆయన చెప్పారు.

Nitish Kumar is praising our water grid: KCR

దయాకర్ విజయానికి అందరం కలిసి పని చేయాలని ఆయన సూచించారు. మన పార్టీ అభ్యర్థి బంపర్ మెజారిటీతో గెలుస్తాడని సర్వేలు తెలియజేస్తున్నట్లు కెసిఆర్ తెలిపారు. వరంగల్ జిల్లాకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పారు. సంక్షేమంలో మన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది నుంచి కళ్యాణలక్ష్మి పథకాన్ని బిసీలకు కూడా వర్తింపజేస్తామని ఆయన అన్నారు.

వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు ప్రభుత్వం రూ.1000, రూ.1500 ఇస్తోన్న పథకం దేశంలోనే చాలా గొప్ప పథకమని తెలిపారు. సన్న బియ్యం మేనిఫెస్టోలో పెట్టకన్నా పెద్ద మనుసుతో ఇస్తున్నామని తెలిపారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

Nitish Kumar is praising our water grid: KCR

ఈ యేడాది 60 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కట్టిస్తామని తెలిపామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పారు. గతంలో ఏదో ఎన్నికల కోసం ఇండ్ల నిర్మాణం చేపట్టే వారని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అలా చేయబోదని స్పష్టం చేశారు. తక్కువ ఇండ్లు కట్టినా పేదలకు న్యాయం జరిగేలా ఇళ్ల నిర్మాణం ఉంటుందని వివరించారు. వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి తండాలన్ని గ్రామ పంచాయతీలు అవుతాయని పేర్కొన్నారు.

గతంలో కరెంట్ కష్టాలు చెప్పనలవి కాదని కానీ ఇప్పుడు కరెంట్ కొరత లేదని తెలిపారు. ఇకపై కరెంట్ కోతలు ఉండవని తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల బరిలోకి దిగిన పసునూరి దయాకర్‌కు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బీ ఫామ్, ఏ ఫామ్ అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+