Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బండి సంజయ్ కు కేటీఆర్ విసిరిన సవాల్ పై స్పందించిన ఎంపీ ధర్మపురి అరవింద్ ..ఏమన్నారంటే

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు తెలంగాణా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ స్పందించారు. కేటీఆర్ ముందు రాజీనామా లేఖతో చర్చకు రావాలని ప్రతి సవాల్ చేశారు . లేదంటే రాజీనామా చేసి రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం కేంద్రానికి ఇచ్చే పన్నుల కంటే కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ ఇస్తోందని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు. కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడొద్దు అని హితవు పలికారు.

కేంద్రం ఇస్తున్న నిధులపై బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్ .. రాజీనామా డిమాండ్
అసలేం జరిగిందంటే రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాలకు కేంద్రం నిధులు ఇస్తోందని బండి సంజయ్ ప్రచారం చేయడాన్ని తప్పు పట్టిన మంత్రి కేటీఆర్ గత ఆరున్నరేళ్ళలో రాష్ట్రం నుంచి కేంద్రానికి అందిన ఆదాయం 2.72 లక్షల కోట్లు కాగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది కేవలం 1.42 లక్షల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారు. తాను చెప్పిన లెక్కలలో తప్పులు ఉంటే, తాను చెప్పింది నిజం కాదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ఇక బండి సంజయ్ చెప్పింది అబద్ధమైతే ఆయన రాజీనామా చేస్తారా అంటూ కేటీఆర్ బండి సంజయ్ కు సవాల్ విసిరారు. గద్వాల పర్యటనలో భాగంగా కేటీఆర్ చేసిన సవాల్ కు బీజేపీ నేతలు ధీటుగా సమాధానం ఇస్తున్నారు.

Nizamabad MP Dharmapuri Arvind responds to KTRs challenge to Bandi Sanjay

కేసీఆర్ రాజీనామా చెయ్యాలని .. కేటీఆర్ సవాల్ కు బండి సంజయ్ కౌంటర్
ఈ క్రమంలోనే కేటీఆర్ సవాల్ కు కౌంటర్ వేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజీనామా చేయాల్సింది కేటీఆర్ కాదు కెసిఆర్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో ప్రజా సంగ్రామ యాత్రలో పర్యటిస్తున్న బండి సంజయ్ కేటీఆర్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు . కెసిఆర్ తనతో పాటు వస్తే ఢిల్లీకి వెళ్లి ఇద్దరం కలిసి రాజీనామా చేద్దామని వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఒక అజ్ఞాని అని, ఆయనకు రాజ్యాంగం తెలియదని పేర్కొన్న బండి సంజయ్ రాష్ట్రం రూపాయి ఆదాయం ఇస్తే కేంద్రం అర్ధరూపాయి మాత్రమే ఇస్తుందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కేటీఆర్ రాజీనామా చేసి రావాలన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
ఇక తాజాగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా కేటీఆర్ ముందు రాజీనామా లేఖతో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్న దానికంటే, కేంద్రం ఎక్కువ నిధులనే రాష్ట్రానికి ఇస్తోందని పేర్కొన్న ధర్మపురి అరవింద్ తాము చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ స్పష్టం చేశారు. దొడ్డు బియ్యం కొనమని కేంద్రం ఎక్కడా చెప్పలేదని, కావాలని మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అరవింద్ మండిపడ్డారు.

రాష్ట్రంలో బియ్యం సేకరణకు ప్రతి పైసాను కేంద్రమే ఇచ్చిందన్న అరవింద్
రాష్ట్రంలో వరి తప్ప మరో పంట లేకుండా చేశారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ మండిపడ్డారు. మొన్నటి వరకు మేమే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో చెప్పాలన్నారు. ఇక రాష్ట్రంలో బియ్యం సేకరణ కోసం ప్రతి పైసాను కేంద్రమే ఇచ్చిందని పేర్కొన్నారు. వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయా, చెరకు వంటి పంటలు ప్రభుత్వ వైఖరితో కనబడకుండా పోయాయి అన్నారు. మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన అరవింద్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+