కెసిఆర్‌తో విభేదాల్లేవు: దేవీప్రసాద్ స్పష్టీకరణ

పిఆర్సీ విషయంలో రెండు రాష్ట్రాలకు ఒకే నిబంధనను వర్తింపజేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. సోమవారంనాడు ఆయన సంగారెడ్డిలోని టిఎన్జీవో కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉద్యోగుల విభజన విషయంలో ఆరు నెలల కిందట ఏర్పాటైన కమలనాథన్ కమిటీ కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు.
తెలంగాణలో పనిచేస్తున్న 40 వేల మంది సీమాంధ్ర ఉద్యోగులను వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన ప్రక్రియ వేగవంతం చేయకపోతే మరో ఉద్యమం చేపడుతామని ఆయన హెచ్చరించారు.
మీడియా సమావేశంలో టిఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications