రెవెన్యూ మిగులు లేదు, అప్పుల కోసమే మరిన్ని అప్పులు: తెలంగాణ అసెంబ్లీలో కాగ్ నివేదిక
హైదరాబాద్: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక.. ఆస్తుల కల్పనపై తెలంగాణ ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగ్ రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. 201-20 ఏడాదికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులపై నివేదికలో కాగ్ కీలక విషయాలు వెల్లడించింది.

రెవెన్యూ మిగులు లేదు, అప్పుల కోసమే అప్పులు: కాగ్ నివేదిక
ఐదేళ్లలో తొలిసారిగా రాష్ట్రం రెవెన్యూ మిగులు సాధించలేదని, ద్రవ్యలోటులో 97 శాతం మార్కెట్ రుణాల ద్వారా వచ్చిందని పేర్కొంది. ఎఫ్ఆర్బీఎంకు అనుగుణంగానే అప్పులు ఉన్నాయని తెలిపింది. 2020 మార్చి 31తో ముగిసిన ఏడాదికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక విడుదల చేసింది. బడ్జెట్ వెలుపల రుణ లక్ష్యాల పరిమితిని ప్రభుత్వం అధిగమనించిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.
2019-20లో తీసుకున్న రుణాల్లో ఎక్కువగా గత అప్పుల కోసమే వాడారని తెలిపింది. 75 శాతానికిపైగా గత అప్పుల చెల్లింపులకే వినియోగించారు. దీంతో ఆస్తుల కల్పనపై ప్రభావం పడింది. 2019-20లో విద్య, వైద్యరంగాలపై తక్కువ ఖర్చు కొనసాగిందని, ఆ ఏడాదిలో ఆస్తుల కల్పనపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపలేదని కాగ్ నివేదిక వెల్లడించింది.

ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్
ఇది ఇలావుండగా, తెలంగాణ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన మంగళవారం సభకు హాజరైన సీఎం కేసీఆర్ ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చర్చను ప్రారంభించారు. సభ సజావుగా నడిపిన సభాపతికి ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. అందరమూ కలిసి బంగారు తెలంగాణ కల సాకారం చేద్దామని ఆయన అన్నారు.
Recommended Video

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థనను తిరస్కరించిన స్పీకర్ పోచారం
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని స్పీకర్‌కు అందించారు ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు. అసెంబ్లీ లోపలికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు... ముందుగా అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. ఆ తర్వాత స్పీకర్‌ను కలిసి తమ వాదనలు వినిపించారు.
అయితే బీజేపీ ఎమ్మెల్యేల అభ్యర్థనను తిరస్కరించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. మీడియా పాయింట్ దగ్గర కూడా ఎమ్మెల్యేలు మాట్లాడవద్దని తెలిపారు. దీంతో అసెంబ్లీ నుంచి బీజేపీ స్టేట్ ఆఫీస్‌కు వెళ్లిపోయారు బీజేపీ ఎమ్మెల్యేలు. హైకోర్టు సూచనల మేరకు అసెంబ్లీ స్పీకర్ ను కలిశారు బీజేపీ ఎమ్మెల్యేలు. స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్ వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications