సింగరేణిని ప్రైవేట్‌పరం చేసేందుకు కెసిఆర్ ప్రయత్నం: జీవన్‌రెడ్డి
సింగరేణి కార్మికులను ఓట్లడిగే నైతిక హక్కు కెసిఆర్‌కు లేదన్నారు సిఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి.సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు.13 ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లకు కె
హైదరాబాద్:సింగరేణి ఎన్నికల్లో కెసిఆర్‌కు ఓట్లడిగే నైతిక హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష ఉపనాయకుడు జీవన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘాన్ని ఓడించాలని జీవన్‌రెడ్డి సింగరేణి కార్మికులను కోరారు.
కార్మికుల శ్రమను టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని కాంగ్రెస్ సీనియన్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణి ఎన్నికల్లో ఆయనకు చుక్కలు చూపించాలని అన్నారు. 2012లో ఎన్నికల సమయంలో కేసీఆర్ ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లతో సింగరేణి బొందలగడ్డగా మారిందంటూ కామెంట్ చేశారని జీవన్‌రెడ్డి గుర్తుచేశారు.

కానీ, తెలంగాణ ముఖ్యమంత్రిగా కెసిఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 13 ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లను ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. సింగరేణి ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కెసిఆర్‌కు లేదన్నారు.
గోదావరిఖనిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని జీవన్‌రెడ్డి గుర్తుచేశారు. కానీ, ఇప్పటివరకు కూడ గోదావరిఖనిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏమైందని ఆయన ప్రశ్నించారు.
సింగరేణిని ప్రైవేటు పరం చేయడానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కెసిఆర్ అప్పులపాలు చేశారని జీవన్ రెడ్డి ఆరోపించారు.
కెసిఆర్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఓడించి కెసిఆర్‌కు బుద్దిచెప్పాలని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications