తెలంగాణలో బీర్ల కొరత!: కారణం ఇదే
తెలంగాణలో బీర్ల కొరత ఏర్పడిందంటూ వస్తున్న వార్తలపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ స్పందించింది. తెలంగాణలో బీర్ల కొరత లేదని, కేవలం కింగ్ ఫిషర్ బ్రాండ్ కొరత తప్ప.. మిగతా అన్ని రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయని ఎక్సైజ్‌శాఖ తెలిపింది. తెలంగాణలో బీరు తయారు చేసే బ్రూవరీస్ కంపెనీలకు మూడో షిప్టు అనుమతించక పోవడంతో కృత్రిమ కొరత ఏర్పడిరదని మీడియాలో వచ్చిన కథనం సత్యదూరమని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్టుమెంట్ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు.
ఈ మేరకు గురువారం ప్రెస్ నోట్ విడుదల చేశారు.'ప్రస్తుతం తెలంగాణలో ఆరు బీరు తయారు చేసే బ్రూవరీస్ కంపెనీలు ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి ఉన్న బీరు తయారీ కంపెనీలు లైసన్స్ షరతుల ప్రకారమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఉంటుంది. సాదారణంగా ఒక షిప్టుకు అనుమతి ఉంటుంది. కానీ బీరు డిమండ్ మేరకు.. బ్రూవరీస్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని అవసరమైన రుసుం చెల్లించిన వారికి మూడు షిప్టులకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఆరు బ్రూవరీస్‌లో, నాలుగు బ్రూవరీస్ 95 శాతం వారి డిమాండ్ కలిగిన బ్రాండ్స్ ఉత్ప్సత్తి చేస్తాయి. బీరు ఉత్పత్తి కంపెనీలు చేసే నాలుగు కంపెనీలకు మూడు షిప్టులకు అనుమతి తీసుకున్నారు' అని పేర్కొన్నారు.

"డిమాండ్ ఉన్న నాలుగు కంపెనీల రోజు వారి ఉత్పత్తి సామార్ధ్యం 1,66,000 కేసులు. ఇలా మూడు షిప్టుల్లో 4,98,000 కేసులు తయారు చేయాల్సి ఉంటుంది. కానీ మూడు షిప్టులు నడుపుకోవడానికి అనుమతి తీసుకున్న కంపెనీలు మూడు షిప్టుల్లో కేవలం 2.51 లక్షల కేసుల బీరును మాత్రమే ఉత్పత్తి చేశాయి. తెలంగాణలో వేసవిలో బీరు సరాసరి రోజుకు 2.00 లక్షల కేసులు అమ్మకాలు జరుగుతాయి. ఇప్పటి వరకు 7.57 లక్షల కేసుల బీరు కేసులు బ్రెవరీస్ కార్పొరేషన్ డిపోల్లో, బ్రూవరీస్‌ల్లో నిల్వలు ఉన్నాయి. మొత్తంగా మార్కెట్‌లో బీరు కొరత లేదు' అని వెల్లడించింది.
'కింగ్ ఫిషర్ బ్రాండ్ కొరత తప్ప మిగిలిన అన్ని రకాలు బీర్లు అందు బాటులో ఉన్నాయి. బీరు తయారు చేసే కంపెనీలు మూడు షిప్టుల అనుమతి తీసుకున్నా కూడా తగిన బీరు ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల కింగ్ ఫిషర్ బీరు కొరత ఏర్పడింది. అయినప్పటికి ఎక్సైజ్ శాఖ యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకొని బీరు నిల్వలకు కొరత లేకుండా చూశారు' అని ఎక్సైజ్ శాఖ అధికారి స్పష్టం చేశారు.
ఇక తెలంగాణలో కొత్త బ్రాండ్‌ల అనుమతికి సంబంధించి గతంలో నుంచి కొనసాగుతున్న పద్ధతినే కొనసాగిస్తున్నామని.. కొత్త సంస్థలు తమ బ్రాండ్స్‌ను తెలంగాణ బేవరీజెస్ కార్పొరేషన్‌కు సరఫరా చేయడానికి నిబంధనలకు కట్టుబడి ఉంటామన్న వారికే అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపింది. గత ఐదేళ్లలో తెలంగాణలో దాదాపు 360 కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడం జరిగింది. గడిచిన ఐదు నెల్లలో నాలుగు బీరు బ్రాండ్స్‌ను సరఫరా చేసేందుకు కార్పొరేషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు.












Click it and Unblock the Notifications