ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు దాఖలు.. తొలిరోజు తెలంగాణాలో దాఖలైన నామినేషన్లివే!!
తెలంగాణా రాష్ట్రంలో నామినేషన్ల స్వీకరణ మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది అభ్యర్ధుల నుంచి మొత్తం 48 నామినేషన్లు దాఖలయినట్లు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ చెప్పారు. హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నామినేషన్లను ఆన్ లైన్లో కూడా దాఖలు చేయవచ్చని CEO చెప్పారు.
ఆన్ లైన్ లోనూ నామినేషన్లు .. కానీ
అయితే ఆన్ లైన్ నామినేషన్ ప్రింట్ పై సంతకం చేసి గడువుకు ఒకరోజు ముందుగా, అంటే ఈ నెల 24 నే రిటర్నింగ్ అధికారికి దాఖలుచేయాలి అని చెప్పారు. ఒక అభ్యర్ధి గరిష్టంగా నాలుగు నామినేషన్లు మాత్రం దాఖలు చేయవచ్చునని, నేర చరిత్రను నియమావళి ప్రకారం ప్రకటించాలన్నారు. అలాగే అఫిడవిట్ లో అన్ని కాలమ్స్ సంతకం చేయాల్సి ఉంటుందని చెప్పారు.

ఆర్వో కార్యాలయంలో నామినేషన్లు వేసేవారికి ప్రత్యేక హెల్ప్ డెస్క్
అభ్యర్ధులంతా ప్రత్యేకంగా బ్యాంకు అకౌంటు కనీసం ఒక రోజు ముందుగా ఓపెన్ చేసి ఉండాలి అని CEO చెప్పారు. కాగా అభ్యర్ధులకు సహాయం చేసేందుకు ఒక హెల్ప్ డెస్క్ RO కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని చెప్పారు. దాదాపు 50 శాసనసభా సెగ్మెంట్లను ఎక్స్పెండిచర్ సెన్సిటివ్ గా గుర్తించి, వ్యయ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
4వేలకు పైగా ఉల్లంఘనలపై కేసులు, సి విజిల్ యాప్ పై 877 ఫిర్యాదులు
MCMC కమిటీల ద్వారా వంద పైగా రాజకీయ ప్రకటనలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. 877 ఫిర్యాదులు సీ విజిల్ పై అందాయని, 4 వేల పైగా MCC ఉల్లంఘనలపై FIR నమోదు చేసినట్లు CEO తెలిపారు. కాగా, 17 జనరల్ పరిశీలకులు రెండు రోజుల్లో చేరుకుంటారనీ 34 మంది ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఇప్పటికే సంబంధిత నియోజకవర్గాలకు చేరుకున్నారని చెప్పారు.
452 అదనపు పోలింగు కేంద్రాలకు అనుమతి
ఎండ తీవ్రత ప్రభావాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా CEO రిటర్నింగ్ అధికారులను అదేశించారు. ఓటు నమోదు చేసేందుకు ఈ నెల 15 వరకు స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరిస్తామని అన్నారు. 452 అదనపు పోలింగు కేంద్రాలకు అనుమతి ఇవ్వనున్నట్టు చెప్పారు సిఈవో.
అదనపు పోలింగ్ కేంద్రాలు ఈ జిల్లాలలోనే
వీటిలో ఎక్కువ నాగర్ కర్నూలు, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. హోం ఓటింగు సదుపాయం వినియోగించుకునే ఓటర్లు తమ అభ్యర్థనలను ఫారం 12డి ద్వారా ఈ నెల 23లోగా ROలకు అందజేయాలని సూచించారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications