తెలంగాణాలో నామినేషన్ల పరిశీలన పూర్తి ... భువనగిరి పెండింగ్ ఎందుకంటే
Recommended Video

తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల స్క్రుటినీ ముగిసింది. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు మొత్తం795 నామినేషన్లు దాఖలు అయ్యాయి . మంగళవారం నామినేషన్ల పరిశీలన అనంతరం 16 స్థానాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ప్రకటించింది.

పరిశీలన తర్వాత 16 స్థానాల జాబితానే ప్రకటించిన ఈసీ
16 లోక్‌సభ స్థానాల్లో 612 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, అందులో 130 మంది అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. మిగిలిన 482 మంది అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించారు. అత్యధికంగా నిజామాబాద్ నుండి 191 నామినేషన్లు ఆమోదించి అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అంత మంది సభ్యులు ఎన్నికల బరిలో నిలతంతో బ్యాలెట్ ముద్రణ తప్పని సరి కానుంది.

భువనగిరిలో తిరస్కరణకు గురైన అభ్యర్థుల పునఃపరిశీలన అప్పీల్
భువనగిరి స్థానంలో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను వివిధ కారణాలతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అందుకే భువనగిరి నియోజకవర్గం మినహా మిగిలినస్థానాల్లో నామినేషన్ల పరిశీలన అనంతరం ఆమోదించిన జాబితాను ప్రకటించారు అధికారులు. అయితే భువనగిరి నియోజకవర్గం నుండి స్వతంత్రులుగా బరిలోకి దిగిన సదరు అభ్యర్థులు పునఃపరిశీలన కోసం అప్పీల్ చేశారు.

భువనగిరి పెండింగ్ ఇందుకే .. 28తో ముగియనున్న ఉపసంహరణ గడువు
భువనగిరి నుండి పోటీ కి నామినేషన్ వేసిన వారి అభ్యర్ధన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకుడు ఈ ముగ్గురు అభ్యర్థుల అప్పీళ్లను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 28న నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఇక దీని తర్వాత అభ్యర్థులు ఎన్నికల బరిలో ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11న లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా, మే 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి .
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications