వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోటిఫికేషన్లకు టైముంది: ఘంటా చక్రపాణి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రూప్స్ నోటిఫికేషన్‌కు ఇంకొంత సమయం పడుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. సిలబస్ మారుతుందని, కొత్త పుస్తకాలు వస్తాయని చెప్పారు. హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ముగింపు సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.

ఇంకా గ్రూప్స్ నోటిఫికేషన్ రాలేదు, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగొద్దని నిరుద్యోగులకు ఆయన సూచించారు. సిలబస్ మారుతుందని.. కొత్త పుస్తకాలు వస్తాయని చెప్పారు. అశోక్‌నగర్ చుట్టూ తిరిగితే ఉద్యోగాలు రావని అన్నారు. మనల్ని మనం అర్థం చేసుకునేందుకు తెలంగాణ చరిత్రను తవ్వితోడాల్సిన అవసరముందని, అలాంటి పరిశోధనలు జరగాలన్నారు.

తెలంగాణ పునర్జీవనానికి దోహదం చేసే పరిశోధనలను ప్రచురణ సంస్థలు ముద్రించాలన్నారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ.. కొత్త భావాలు ప్రపంచంలోకి వెళ్లడానికి పుస్తకాలే సాధనమని, ఇలాంటి పుస్తక ప్రదర్శనలను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. పుస్తకం కొలిమివంటిదని, దాని ప్రభావం సమాజంపై ఉంటుందని, మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుందని చెప్పారు.

బుక్ ఫెయిర్

బుక్ ఫెయిర్

పుస్తక ప్రదర్శన చివరిరోజు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు బుక్ ఫెయిర్‌లో సందడి చేశారు.

బుక్ ఫెయిర్

బుక్ ఫెయిర్

బుక్ ఫెయిర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పాయి.

బుక్ ఫెయిర్

బుక్ ఫెయిర్

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి పుస్తక ప్రదర్శనకు మునుపెన్నడూ లేనివిధంగా మూడు లక్షల మందికిపైగా సందర్శకులు హాజరయ్యారని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, కార్యదర్శి చంద్రమోహన్ తెలిపారు.

బుక్ ఫెయిర్

బుక్ ఫెయిర్

బక్ పెయిర్‌కు భారీగా స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. కాగా, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు పుస్తక ప్రదర్శనను సందర్శించి కొన్ని పుస్తకాలను కొనుగోలు చేశారు.

ఘంటా చక్రపాణి

ఘంటా చక్రపాణి

గ్రూప్స్ నోటిఫికేషన్‌కు ఇంకొంత సమయం పడుతుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. సిలబస్ మారుతుందని, కొత్త పుస్తకాలు వస్తాయని చెప్పారు.

ఘంటా చక్రపాణి

ఘంటా చక్రపాణి


హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ముగింపు సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఇంకా గ్రూప్స్ నోటిఫికేషన్ రాలేదు, కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగొద్దని నిరుద్యోగులకు ఆయన సూచించారు.

English summary
TSPSC Chairman Ghanta Chakrapani on Friday said that notification of groups have time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X