ఢక్కామొక్కీలు తిని, జల్సాలు మరిగి, సీరియల్ స్నాచర్‌గా మారి..

హైదరాబాద్: సీరియల్ స్నాచర్‌గా మారిన ఘరానా దొంగను హైదరాబాదులో దక్షిణ మండలం పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్థిరపడి చైన్ స్నాచింగ్‌లో అందె వేసిన చేయిగా మారాడు.

పేరు మోసిన చైన్ స్నాచర్ మీర్ అయ్యాన్ పదకొండు నేరాలకు పాల్పడినట్లు,, 430 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు పోలీసు కమిషనర్ వివి శ్రీనివాస రావు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డిసిపి చైతన్యకుమార్‌తో కలిసి గురువారం ఆయన చైన్ స్నాచర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఆ దొంగకు అన్నీ సినిమా కష్టాలే.

ఆ దొంగకు అన్నీ సినిమా కష్టాలే.

మహారాష్ట్రలోని జల్గాం ప్రాంతానికి చెందిన మీర్ అయాన్ అలీ ఖాన్ అలియాస్ అబ్దుల్లా తాను పుట్టక ముందే తండ్రిని కోల్పోయాడు. అతని తొమ్మిదో ఏట తల్లి కూడా చనిపోయింది. దీంతో అతను మేనత్త వద్దకు చేరాడు. ఆమె పెడుతున్న బాధలు భరించలేక పారిపోయాడు.

 అనాథ శరణాలయానికి చేరాడు

అనాథ శరణాలయానికి చేరాడు

వీధుల్లో తిరుగుతున్న ఖాన్‌ను గమనించిన స్థానికులు అత్ని కొలాబా ప్రాంతంలోని యాంకరేజ్ అనాథ శరణాలయానికి తరలించారు. అక్కడే ఉండి ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. సమయంలో హోమ్ మూతపడింంది. దాంతో మళ్లీ రోడ్డున పడ్డాడు.

ఈ పని నేర్చుకుని హైదరాబాద్ వచ్చాడు

ఈ పని నేర్చుకుని హైదరాబాద్ వచ్చాడు

ఆ తర్వాత మార్బుల్ స్టోన్స్ పరిచే పని నేర్చుకున్నాడు. ఆ వృత్తిని కొనసాగించే ఉద్దేశంతో 2010లో హైదరాబాద్ వచ్చాడు.అయితే, దాంతో వచ్చే ఆదాయం అతనికి సరిపోలేదు. జల్సాలకు అలవాటు పడి ప్రత్యామ్నాయ ఆదాయాల కోసం అన్వేషించాడు. చోరీలు చేయడం ప్రారంభించాడు. చైన్ స్నాచింగ్ చేసే క్రమంలో అతన 2011లో సైదాబాదులో పోలీసులకు చిక్కాడు.

జైలులో ఉండగా వారితో పరిచయాలు

జైలులో ఉండగా వారితో పరిచయాలు

ఆ చైన్ స్నాచింగ్ కేసులో జైలులో ఉన్న సమయంలో బోయిన్‌పల్లి నుంచి వాహనం చోరీ కేసులో జైలుకు వచ్చిన తలాబ్‌కట్టవాస మహ్మద్ అహ్మద్ అలీతో పరిచయం ఏర్పడింది. జైలులో వారిద్దరు జత కట్టారు. బయటకు వచ్చిన తర్వాత వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ వచ్చారు.

 ఆ తర్వాత మరొకను పరిచయం

ఆ తర్వాత మరొకను పరిచయం

ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి స్థిరపడిన హరేందర్ ింగ్‌తో ఆయాన్‌కు పరిచయం ఏర్పడింది. అతను కూడా ఈ ముఠాలో చేరాడు. అలీ లేదా సింగ్ బైక్ వెనక సీట్లో కూర్చోగా ప్రతి రోజు బైక్ నడుపుతూ చైన్ స్నాచింగ్‌లు చేయడం ప్రారంభించాడు.

 ముగ్గురు ఇలా నేరాలు చేశారు...

ముగ్గురు ఇలా నేరాలు చేశారు...

ఆ ముగ్గురు 2014- 15 సంవత్సరాల్లో సంతోష్ నగర్, కార్ఖానా, ముషీరాబాద్, చిలకలగుడా, మేడిపల్లి, చందానగర్, మీర్‌పేట, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, నల్లకుంట, టప్పాచబుత్రా పరిధుల్లో 11 నేరాలు చేసి పోలీసులకు చిక్కారు. ఆయాన్‌పై సంతోష్ నగర్ పోలీసులు 2016లో పిడీ యాక్ట్ నమోదు చేశారు.

 కొన్నాళ్లు ఆటో డ్రైవర్‌గా పనిచేశాడు

కొన్నాళ్లు ఆటో డ్రైవర్‌గా పనిచేశాడు

నిరుడు ఫిబ్రవరిలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అయాన్ కొన్నాళ్లుఆటో డ్రైవర్‌గా పనిచేశాడు. అలా వచ్చే ఆదాయం సరిపోలేదు. దీంతో పాత మిత్రులతో కలిసి స్నాచింగ్‌లు ప్రారంభించాడు. నిరుడు మే నుంచి లంగర్‌హౌస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, అంబర్‌పేట, గాంధీనగర్, మలక్‌పేట, నార్సింగి, ఉప్పల్, మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధుల్లో 11 నేరాలు చేశాడు. 2011లో మొదటిసారి అరెస్టయిన అయాన్ ఆ తర్వాత రెండు దశల్లో 11 చొప్పున నేరాలు చేశాడు.

పోలీసుల దర్యాప్తు తీరుపై అవగాహన

పోలీసుల దర్యాప్తు తీరుపై అవగాహన

ఆయాన్ ప్రతి రోజూ హిందీ పేపర్లు చదువుతాడు. అతనికి పోలీసుల దర్యాప్తు తీరుపై కూడా అవగాహన ఉంది. పోలీసులు ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తులో ముందుకు సాగుతారనే విషయం అతనికి తెలుసు. దీంతో అతను తొలుత రెండు స్నాచింగ్‌లను మిత్రుడి వాహనంపై తిరుగుతూ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఆ తర్వాత తానే సెకండ్ హ్యాండ్ వాహనం కొనుక్కున్నాడు. దానికి నకిలీ నెంబర్ ప్లేట్ తగిలించాడు. ఎప్పుడూ హెల్మెట్ ధరించేవాడు వెనుక కూర్చునే అలీ, సింగ్‌లకు మాస్క్ వేయించేవాడు. చోరీలకు వాడిన వాహనాన్ని తలాబ్‌కట్టలోని తన నివాసం వద్ద కాకుండా దూరంంగా పార్క్ చేసేవాడు.

 ఈ తప్పు చేసి దొరికిపోయాడు

ఈ తప్పు చేసి దొరికిపోయాడు

హెల్మెట్ ధరించి టార్గెట్‌ను ఎంచుకునే క్రమంలోనే రెండు సార్లు తప్పు చేశాడు. మీర్‌పేట పరిధిలో చేసిన రెండు స్నాచింగ్‌ల్లోనూ మహిళల మెడలో పసుపు రంగులో ఉన్న నైలాన్ తాడును బంగారు పుస్తెలతాడుగా భావించి స్నాచింగ్ చేయించాడు. ఆ ఘటనల్లో బంగారు పుస్తెలు మాత్రం దొరికిాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎనిమిది నెలల పాటు అతను చైన్ స్నాచింగ్‌లు చేయగలిగాడు.

 పోలీసులు ఇలా గుర్తించారు

పోలీసులు ఇలా గుర్తించారు

నిరుడు మే నుంచి వరుసగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠా కదలికలను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జనవరిలో గుర్తించారు తమ వాహనానికి నకిలీ నెంబర్ ప్లేటు తగిలించి కూడా ప్రతి రోజూ ఒకే ప్లేట్ వాడడంతో పోలీసులకు ఆధారం దొరికింది. సిసి టీవీ కెమెరాల్లో రికార్డు అయిన కదలికల ఆధారంగా ముఠాను పాతబస్తీకి చెందిందని గుర్తించారు. వాటి ఆధారంగా దాదాపు నెల రోజుల పాటు పాతబస్తీలో గాలించారు. గురువారం వాహనంపై వస్తున్న ఆయాన్‌ను పట్టుకున్నారు. అతని నుంచి 311 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.25 లక్షల నగదు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+