తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్; కారణజన్ముడు: మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్!!
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులు, రాజకీయ రంగ ప్రముఖులు నటసార్వభౌమ ఎన్టీ రామారావు ను స్మరించుకుంటున్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రముఖులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆ మహనీయుని స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
నూటికో కోటికో ఒక్కరు.. వందేళ్లు కాదు.. చిరకాలం మన మనసులో మిగిలిపోతారు అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చరిత్ర వారి గురించి భావితరాలకు గర్వంగా చెబుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ అటువంటి కారణజన్ముడని కొనియాడారు. తెలుగు జాతి ఘన కీర్తి కి వన్నెతెచ్చిన నందమూరి తారక రామారావు తో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం అంటూ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను స్మరించుకున్నారు.

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ కు అంజలి ఘటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన పవన్ కళ్యాణ్ తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. చరిత మరువని నటనాకౌశలం, తెలుగు నుడికారం పై మమకారం, పార్టీని స్థాపించిన 8 నెలల్లోనే అధికారం కైవసం అంటూ ఎన్టీఆర్ సాధించిన ఘనతను చెప్పుకొచ్చారు.
నూటికో కోటికో ఒక్కరు... వందేళ్లు కాదు...చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాల కి గర్వంగా చెబుతుంది.
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2023
అలాంటి కారణ జన్ముడు శ్రీ NTR.
తెలుగు జాతి ఘనకీర్తి కి వన్నె తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం.…
ఇలా మాట్లాడుతూ ఉంటే మనందరికీ స్పురణకు వచ్చే ఒకే ఒక్క పేరు నందమూరి తారక రామారావు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మేలైనది, అందరికీ అనుసరణీయం అయినదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు .
తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక శ్రీ ఎన్.టి.ఆర్. - JanaSena Chief Shri @PawanKalyan #100YearsOfNTR #NTRJayanti pic.twitter.com/43DXD4qKeX
— JanaSena Party (@JanaSenaParty) May 28, 2023
నాటి ఢిల్లీ పాలకులు తెలుగు జాతి ఖ్యాతి ని గుర్తించని సమయంలో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఎన్నికలలో అజేయమైన విజయం అందుకుని తెలుగువారి సత్తా ఢిల్లీ దాకా చాటారని అన్నారు. సినీ రంగంలోనూ, రాజకీయరంగంలోనూ తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ పుణ్య దినాన మహనీయునికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున నీరాజనాలు అర్పిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
-
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications