సెక్స్ టార్షన్ కు పాల్పడుతున్న కిలేడీలు.. కక్కుర్తి పడ్డారో మీ జేబులు గుల్ల!

సామాజిక మాధ్యమాలు పెరుగుతున్న కొద్దీ, సామాజిక మాధ్యమాల వినియోగం ఎక్కువ అవుతున్న కొద్దీ వాటి ద్వారా మోసాలు కూడా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. విచ్చలవిడిగా డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనీలు రకరకాలుగా చాలామంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. కొన్ని రకాల సైట్లు, యాప్ లు వలపు వల విసురుతూ ఎంతోమంది బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నాయి.

సెక్స్ టార్షన్ కు పాల్పడుతున్న కిలేడీలు
ఒంటరిగా ఉంటున్న వారిని టార్గెట్ చేసి వారిని నిదానంగా ట్రాప్ చేసి, ఆ తరువాత వారితో సెక్స్ టార్షన్ కు పాల్పడుతూ వారి బ్యాంకు ఖాతాలోని డబ్బులను యదేచ్ఛగా కొల్లగొడుతున్న కిలేడి లు ప్రస్తుత సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఇటువంటివారు ఎంతోమంది హనీ ట్రాప్ ద్వారా బాధితులుగా మారుతున్నారు. విశ్రాంత ఉద్యోగులను టార్గెట్ చేసి మోసం చేస్తున్న కిలేడీలు కోట్ల రూపాయలను స్వాహా చేస్తున్నారు.

nude video calls fraud in hyderabad in online beware

ఉద్యోగ విరమణ చేసిన వారే టార్గెట్
ఉద్యోగ విరమణ చేసిన వారు, పరువు మర్యాదలతో బతికిన వారిని చాలామందిని, టార్గెట్ చేసిన కొందరు కిలాడి మహిళలు రాత్రివేళల్లో వాట్సప్ కాల్స్ చేస్తారు. పొరపాటున కాల్ చేసినట్టు, రాంగ్ కాల్ అని ఫోన్ పెట్టేస్తారు. ఆ తర్వాత రోజు సారీ చెబుతూ మాట కలుపుతారు. ఆ తర్వాత వారి ఫోన్ కాల్స్ స్నేహంగా, ఆపై ప్రేమగా, ఆ తర్వాత మరింత సాన్నిహిత్యం పెరిగి వారిద్దరిమధ్య డేటింగ్ గా మారుతుంది.

న్యూడ్ కాల్స్ చేసి .. ఆపై వీడియోలతో బెదిరింపులు
హాఫ్ న్యూడ్ ఫోటోలు పంపడం, న్యూడ్ ఫోటోలు పంపడం, న్యూడ్ కాల్స్ చేసుకోవడం ఇలా పరిస్థితులు మారుతాయి. ఆ తర్వాత ఆ వీడియోలను పోర్న్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తామని మరో వ్యక్తి కాల్ చేసి బెదిరింపులకు పాల్పడతాడు. అక్కడినుంచి డబ్బుల వసూళ్లు మొదలవుతాయి. ఈ విధంగా హనీ ట్రాప్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు హైదరాబాద్ నగరంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి.

20 రోజుల్లోనే 13 నుంచి 14 కేసులు నమోదు
ఒక 20రోజుల్లోనే 13నుంచి 14కేసులు నమోదయ్యాయి అంటే హైదరాబాద్లో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న విశ్రాంత ఉద్యోగులనే టార్గెట్ చేసుకొని ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. ఇలా మోసపోతున్న వారిలో ఎక్కువమంది బయటకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి లేదు. బయట తెలిస్తే పరువు పోతుందని ఆందోళనతో, వారు అడిగినంత చెల్లించుకుని నరకాన్ని అనుభవిస్తున్నారు.

హనీ ట్రాప్ పై పోలీసుల హెచ్చరిక
ఈ హనీ ట్రాప్ లో చిక్కుకొని తీవ్ర అనారోగ్యాన్ని కూడా ఎదుర్కొంటున్న వారు లేకపోలేదు. అందుకే ముఖ్యంగా హైదరాబాద్లో ఒంటరిగా ఉంటున్న రిటైర్డ్ ఎంప్లాయిస్ జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. డేటింగ్ యాప్స్, మ్యాట్రిమోనీలు, సోషల్ మీడియా యాప్స్ ఇలా వేటి నుండి, ఎవరైనా అమ్మాయిలు పేరుతో వచ్చిన చాటింగ్ ను, కాల్స్ ను, వీడియో కాల్స్ ను యాక్సెప్ట్ చెయ్యొద్దని సూచిస్తున్నారు. అనవసరమైన రిస్క్ లలో పడొద్దని, న్యూడ్ కాల్స్ మోజులో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+