ప్రియుడి కోసం తల్లిదండ్రులను చంపిన నర్స్ సురేఖ అదే తరహాలో ఆత్మహత్య!
ప్రియుడి మోజులో పడి తల్లిదండ్రులను అత్యంత పాశవికంగా హతమార్చిన వికారాబాద్ జిల్లాకు చెందిన నర్సు సురేఖ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆరు నెలల క్రితం సురేఖ ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని భావించింది. అయితే సురేఖ పెళ్ళికి తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారని భావించి సురేఖ వారిని హతమార్చాలని ప్లాన్ చేసి తల్లిదండ్రులకు మత్తి ఇంజక్షన్లు ఇచ్చి ప్రాణాలు తీసింది.
బెయిల్ పై బయటకు వచ్చిన నర్స్ సురేఖ ఆత్మహత్య
తల్లిదండ్రులకు ఒళ్ళు నొప్పుల మందు ఇస్తున్నానని చెప్పి, వారికి అధిక డోసు మత్తు ఇంజక్షన్స్ ఇచ్చి వారిని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించి ఆమెపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్టల్‌లో సురేఖ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

తల్లిదండ్రులను చంపినట్టే తన ప్రాణం తీసుకున్న సురేఖ
గతంలో తల్లిదండ్రులను హత్య చేసిన కేసులో జైలుకు వెళ్ళిన సురేఖ ఇటీవలే బెయిల్ మంజూరై బయటకు వచ్చింది. సంగారెడ్డిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న ఆమె తాజాగా హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ లో ఆమె మృతదేహం లభించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన విధానంలోనే, మత్తు ఇంజక్షన్ చేసుకుని తన జీవితాన్ని కూడా ముగించుకోవడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.
సురేఖ మృతదేహం తీసుకెళ్ళని బంధువులు
సంగారెడ్డి పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆమె మృతదేహాన్ని తీసుకు వెళ్ళటానికి బంధువులు ఎవరూ రాలేదు, ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతికి గల కారణాలపై దర్యాప్తు
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఏమిటి అనే అంశాలపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో కన్నవారినే కాటికి పంపిన సురేఖ జీవితం ఇలా ముగియడం అందరినీ షాక్‌కు గురిచేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.













Click it and Unblock the Notifications