చర్లపల్లి సెంట్రల్ జైలును సందర్శించిన సివిల్స్ శిక్షణార్థులు..!

డాక్టర్ ఎం.సీ.ఆర్. మానవ వనరుల అభివృద్ధి సంస్థ.. తెలంగాణకు చెందిన 190 మంది సభ్యుల బృందం బుధవారం చర్లపల్లి కేంద్ర కారాగారం, ఖైదీల వ్యవసాయ క్షేత్రాన్ని (పీఏసీ)ని సందర్శించారు. అఖిల భారత సర్వీసులు, కేంద్ర సివిల్ సర్వీసుల అధికారుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఈ పర్యటన చేపట్టారు. ఈ బృందంలో 175 మంది అధికార శిక్షణార్థులు ఉండగా.. వారిలో 60 మంది మహిళలు, 115 మంది పురుషులు ఉన్నారు. వీరితో పాటు 15 మంది అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

అలాగే ఈ బృందంలో ఐఎఫ్ఓఎస్ కు చెందిన 44 మంది, ఐపీఎస్ కు చెందిన 20 మంది, ఐఆర్ఎస్ కు చెందిన 39 మంది అలాగే ఐఎస్ ఎస్ కు చెందిన 34 మంది, ఐఈఎస్ కు చెందిన 12 మంది అధికారులు ఉన్నారు. వీరితో పాటు ఐఏ అండ్ ఏఎస్ కు చెందిన ఐదుగురు, ఐఐఎస్ కు చెందిన ఐదుగురు, ఐసీఏఎస్ కు చెందిన ముగ్గురు, ఐసీఎల్ఎస్ కు చెందిన ఒకరు, ఐడీఏఎస్ కు చెందిన ఒకరు, ఐఆర్ ఎంఎస్ కు చెందిన నలుగురు, పోస్టల్ సంబంధిత సేవలకు చెందిన ముగ్గురు, భారత పోస్టులు, టెలికమ్యూనికేషన్స్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సేవకు చెందిన ఇద్దరు అధికారులు ఉన్నారు.

ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం జైళ్ల పరిపాలన, భద్రతా ఏర్పాట్లు, ఖైదీల నిర్వహణ, దిద్దుబాటు చర్యలు, పునరావాస కార్యక్రమాలపై అధికార శిక్షణార్థులకు ప్రత్యక్ష అవగాహన కల్పించడం. ఈ సందర్భంగా తెలంగాణ జైళ్లు, దిద్దుబాటు సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా.. శిక్షణార్థులకు స్వాగతం పలికి జైళ్ల శాఖ విధులు, లక్ష్యాలను వివరించారు. జైళ్లు కేవలం ఖైదీలను నిర్బంధించే కేంద్రాలు మాత్రమే కావని వారిలో మార్పు తీసుకువచ్చి, తిరిగి సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా తీర్చిదిద్దే సంస్కరణ, పునరావాస కేంద్రాలని ఆమె పేర్కొన్నారు.

జైళ్లలో భద్రత, క్రమశిక్షణను కాపాడటంతో పాటు ఖైదీలకు విద్య, వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారిలో సానుకూల మార్పు తీసుకురావడానికి శాఖ కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణ జైళ్ల శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను అధికారులు శిక్షణార్థులకు వివరించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా ఖైదీలకు విద్యను అందించడం, చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఐటీఐ కళాశాల ఏర్పాటు, జైలు పరిశ్రమల ద్వారా స్టీల్ ఫర్నిచర్, ఫినాయిల్, సబ్బులు, హ్యాండ్ వాష్, శానిటైజర్ల తయారీ వంటి కార్యక్రమాల గురించి వివరించారు.

అదేవిధంగా వడ్రంగం, పాడి పరిశ్రమ, కూరగాయల సాగు, ఇంధన విక్రయ కేంద్రాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ఖైదీల్లో పని నైపుణ్యాలు, బాధ్యత, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు విడుదల అనంతరం స్వతంత్రంగా జీవించేందుకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. అనంతరం శిక్షణార్థులు ఖైదీల వ్యవసాయ కాలనీని సందర్శించి అక్కడ అమలు అవుతున్న బహిరంగ జైలు విధానం గురించి తెలుసుకున్నారు.

Officer trainee from the MCR HRD Institute visited the Cherlapally Central Jail and pac farm today

ఈ విధానంలో ఖైదీలకు ఉత్పాదక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం కల్పించడం, వారిలో స్వీయ క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించడం, సమాజంలో తిరిగి కలిసిపోయేందుకు అవసరమైన లక్షణాలను అభివృద్ధి చేయడం వంటి అంశాలపై అవగాహన పొందారు. పర్యటన సందర్భంగా పలువురు అధికార శిక్షణార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ తెలంగాణ జైళ్ల శాఖ చేపడుతున్న విద్యా కార్యక్రమాలు, వృత్తి నైపుణ్య శిక్షణ, జైలు పరిశ్రమలు, ఖైదీల సంస్కరణ, పునరావాస కార్యక్రమాలను అభినందించారు. జైళ్ల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ పర్యటన ఉపయోగపడిందని పేర్కొన్నారు. ఖైదీల భద్రతతో పాటు వారి చట్టపరమైన హక్కులు, మానవ గౌరవం, వ్యక్తిత్వ పరివర్తనకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ సందర్శన ద్వారా గుర్తించినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+