Telangana: సచివాలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు..
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కొత్త ప్రభుత్వం కోసం సచివాలయం సిద్ధమవుతోంది. రాబోయే ముఖ్యమంత్రి కోసం సచివాలయంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలంలోని ఛాంబర్ లను జీఎడీ శాఖ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలను సిబ్బందిని ఖాళీ చేయించింది.
దీంతో పాత బోర్డులను తొలంగించారు అధికారులు. సచివాలంలో కొలువుదీరనున్న కొత్త మంత్రులకు కొత్త సిబ్బందిని కేటాయించనున్నట్లు సమాచారం. ఇక 6వ అంతస్తులో ఉన్న ముఖ్యమంత్రి ఛాంబర్ వద్ద ఉన్న కేసీఆర్ బోర్డ్ తోపాటు స్మితా సబర్వాల్ బోర్డ్ ను కూడా అధికారులు తొలగించారు. సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో మీడియాకు ప్రత్యేక గది కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రస్తుతం ఉన్న క్యాంటీన్ హాల్ ను మీడియా సెంటర్ గా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సచివాలయానికి సరిగా రాలేదు. రాబోయే సీఎం సచివాలయం వేదికగానే పాలన కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
అయితే, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. రేవంత్ పేరు ఖరారైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ కాన్ఫమ్ కాలేదు.
ఈ విషయంపై అధిష్ఠానంతో చర్చించేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, నలుగురు పరిశీకులు ఢిల్లీకి వెళ్లారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. మల్లు భట్టీ విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు పేర్లు వినిపిస్తున్నా.. మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications