Telangana: భారీ వర్షాలతో రూ.5438 కోట్ల నష్టం..!

భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు అల్లాడిపోయారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల పంట పొలాలపై ఇసుక మేటలు వేసింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడి పంటలు మునిగిపోయాయి. అలాగే చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల వంతెనలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో అధికారులు వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో భారీ వర్షాలతో రూ.5438 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర సీఎంవో ఒక ప్రకటన చేసింది. వర్షాలతో రోడ్లు భారీగా దెబ్బతిన్నాయని రోడ్లు భవనాల శాఖ పేర్కొంది. రోడ్ల దెబ్బతినడంతో రూ. 2,362 కోట్లు నష్టం జరిగినట్లు వివరించారు. స్తంభాలు విరిగిపోవడం. వైర్లు తెగిపోవడంతో విద్యుత్ శాఖ కూడా నష్టపోయింది. విద్యుత్ శాఖకు రూ. రూ. 175 కోట్ల నష్టం వాటినట్లు అంచనా వేశారు. పంటలు దెబ్బతినడం రూ.415 కోట్లు నష్టం జరిగినట్లు పేర్కొన్నారు.

Officials have estimated that the heavy rains caused a loss of Rs 5438 crores in Telangana

లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంట అంచనా ఇంకా పెరిగే అవకాశం ఉంది. నీటి పారుదల శాఖకు రూ. 629 కోట్లు, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధికి రూ.170 కోట్లు, వైద్య, ఆరోగ్యశాఖకు రూ.12 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.25 కోట్లు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు రూ.1150 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అయితే పంట నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఎకరాకు రూ.10 చొప్పున పంటనష్ట పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

భారీ వర్షాల నేపథ్యంలో 110 సహాయ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 4000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వివరించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అటు ఏపీలో కూడా భారీ వర్షాల కారణంగా ఆర్థిక, ప్రాణం నష్టం వాటిల్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+