పాతబస్తీ మెట్రోరైలు రెండో దశ నిర్మాణంపై బిగ్ అప్డేట్

హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రైల్ ప్రాజెక్టు పనుల్లో అత్యంత కీలకమైన భూసేకరణ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన ఈ మెట్రో కారిడార్ కోసం ఏకంగా 93 శాతానికి పైగా భూసేకరణ పూర్తయింది.

మెట్రో ఫేజ్-2 కారిడార్-6 ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశం

ఈ ప్రతిష్టాత్మక మెట్రో ఫేజ్-2 కారిడార్-6 ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు జరుపుతున్నారు.
పాతబస్తీలోని దట్టమైన జనాభా, సన్నని రహదారుల కారణంగా ఈ మార్గంలో భూసేకరణ ప్రక్రియ అధికారులకు పెద్ద సవాలుగా మారింది.

Old City Metro expansion metro route between MGBS and Chandrayangutta land aquisition has been completed

మెజారిటీ ఆస్తుల యజమానులకు ప్రభుత్వం తరఫున పరిహారం

ప్రాథమిక అంచనాల ప్రకారం మొదట 1,100 ఆస్తులు ప్రభావితం అవుతాయని భావించినప్పటికీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఇంజనీరింగ్ రీ-డిజైన్, వ్యూహాత్మక అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా ఆ సంఖ్యను దాదాపు 888 కి తగ్గించగలిగారు. ఇందులో మెజారిటీ ఆస్తుల యజమానులకు ప్రభుత్వం తరఫున వందల కోట్ల రూపాయల పరిహారాన్ని ఇప్పటికే పంపిణీ చేశారు.

నిబంధనల ప్రకారం పరిహారం అందించడానికి బాధితులతో సంప్రదింపులు

ప్రస్తుతం మిగిలిన ఉన్న కొద్దిపాటి ఆస్తుల సేకరణలో కుటుంబ వివాదాలు, కోర్టు కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా దారుల్‌షిఫా పరిసరాల్లోని కొన్ని ఆస్తులపై యాజమాన్య హక్కుల వివాదాలు కోర్టు పరిధిలో ఉండగా, మరికొన్నింటికి మైనర్లు వారసులుగా ఉన్నారు. ఇలాంటి చిక్కులను తొలగించి, చట్టపరమైన నిబంధనల ప్రకారం పరిహారం అందించడానికి అధికారులు బాధితులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఎబోలాపై తప్పుడు వివరాలిస్తే క్రిమినల్ కేసులు పెడతాం: మంత్రి హెచ్చరిక!
ఎబోలాపై తప్పుడు వివరాలిస్తే క్రిమినల్ కేసులు పెడతాం: మంత్రి హెచ్చరిక!

అత్యాధునిక డ్రోన్ సర్వేల ద్వారా పనులు పర్యవేక్షణ

పాతబస్తీ ప్రజల సెంటిమెంట్లు, అవసరాలను గౌరవిస్తూ ఎలాంటి బలవంతం లేకుండా, అవగాహన కల్పిస్తూ భూసేకరణను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. భూసేకరణ దాదాపు కొలిక్కి రావడంతో మెట్రో పిల్లర్ల మార్కింగ్, మట్టి నమూనాల పరీక్షలు జోరందుకున్నాయి. చారిత్రాత్మక కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అత్యాధునిక డ్రోన్ సర్వేల ద్వారా పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇదే సమయంలో రోడ్ల విస్తరణతో పాటు అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలు, మంచినీరు, డ్రైనేజీ పైప్‌ లైన్ల వంటి ఇతర ప్రజా ఉపయోగ వ్యవస్థల మార్పిడి పనులను కూడా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో వేగవంతం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+