Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రివర్స్! ఢిల్లీ అంతే దూరం: మోడీని కట్టిపడేసిన కేసీఆర్ (పిక్చర్స్)

గజ్వేల్: తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రసంగంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కట్టిపడేశారు. ఆదివారం నాడు మిషన్ కాకతీయ సహా ఇతర పనులకు ప్రధాని శంకుస్థాపన చేసిన అనంతరం పలువురు ప్రసంగించారు. తొలుత సీఎం కేసీఆర్, చివరలో ప్రధాని మోడీ మాట్లాడారు.

సీఎం కేసీఆర్ హిందీలో మాట్లాడి ప్రధాని మోడీని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కేంద్రంలో అవినీతిరహిత పాలన కొనసాగుతోందని, తమకు కేవలం ప్రేమ, ఆశీస్సులు లభిస్తే చాలని, రెండున్నరేళ్ల మోడీ పాలనలో అవినీతి మచ్చుకు కూడా లేదని ఆకాశానికెత్తారు.

తెలంగాణ ఏర్పడ్డాక, కేసీఆర్ భావోద్వేగం: తెలుగులో మోడీ, పరస్పరం కితాబుఅదే సమయంలో తమకు ఓ జాతీయ ప్రాజెక్టు కావాలని విజ్ఞప్తి చేశారు. పరస్పర సహకారం అవసరమని, ఒకరి వెంట ఒకరు వెళితేనే అభివృద్ధి సాధ్యమని ఆ తర్వాత ప్రధాని మోడీ చెప్పారు. తెరాస పాలన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వెళ్తోందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఈ సభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు గడిచిన రెండేళ్లలో ఎవరేం చేస్తున్నారో చెబుతూ.. ఒకరిపై ఒకరు ప్రశంసలు, అభినందనలు కురిపించుకున్నారు. మొత్తానికి, ఆదివారం గజ్వేల్‌లో జరిగిన సభలో అటు ప్రధాని మోడీ, ఇటు సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాల్లో పరస్పరం సహకారం, అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు.

బీజేపీతోనే తెలంగాణ, మోడీ! మాకెంతో చేశారు: హిందీలో కేసీఆర్, వెంకయ్య వల్లే..తన 40 ఏళ్ల రాజకీయాల్లో ఎన్నడూ అవినీతిరహిత పాలనను చూడలేదని, గడిచిన రెండేళ్లుగా 100 శాతం అవినీతిరహిత ప్రభుత్వాన్ని, పాలనను చూస్తున్నానంటూ సీఎం కేసీఆర్ కేంద్రంపై, మోడీపై ప్రశంసలు కురిపించగా, గడిచిన రెండేళ్లుగా పలుమార్లు తన వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్‌లో ప్రతిసారీ తెలంగాణ అభివృద్ధి కోసం పరితపించారంటూ మోడీ పేర్కొన్నారు.

కాగా, ప్రధాని మోడీ రెండేళ్లుగా తెలంగాణకు రాలేదని తెరాస నేతలు గతంలో విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో తాము తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తున్నామని కేంద్రమంత్రులు ధీటుగా స్పందించేవారు. కానీ గజ్వెల్ సభలో పరస్పరం ప్రశంసలు కనిపించాయి. సాయంత్రం నిజాం కాలేజీ గ్రౌండులో మాత్రం రాష్ట్రస్థాయి నేతలు కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు.

గజ్వెల్ బహిరంగ సభ

గజ్వెల్ బహిరంగ సభ

దేశ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భుజం, భుజం కలిపి ముందుకు సాగాల్సి ఉందని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. తెలంగాణలో ఇంటింటికీ మంచినీరివ్వాలన్న లక్ష్యంతో టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం మిషన్‌ భగీరథను ఆదివారం గజ్వేల్‌లోని కోమటిబండ వద్ద ఆయన ఆవిష్కరించారు.

 గజ్వెల్ బహిరంగ సభ

గజ్వెల్ బహిరంగ సభ

అనంతరం ఎన్టీపీసీ థర్మల్‌ విద్యుత్తు, రామగుండం ఎరువుల కర్మాగారం, కాళొజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపనతో పాటు, ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌లో నిర్మించిన సింగరేణి థర్మల్‌ విద్యుత్తు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు.

 గజ్వెల్ బహిరంగ సభ

గజ్వెల్ బహిరంగ సభ

'సోదర, సోదరీమణులారా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజలందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు' అంటూ తెలుగులో ప్రసంగం ఆరంభించిన మోడీ.. అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణతో కలిసి కేంద్రం పనిచేస్తుందని హామీ ఇచ్చారు.

గజ్వెల్ బహిరంగ సభ

గజ్వెల్ బహిరంగ సభ

తెలంగాణకు హైదరాబాద్‌ ఎంత సొంతమో, ఎంత దగ్గరో, ఢిల్లీ కూడా అంతే దగ్గరని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారి ఇక్కడికి వచ్చానని, దేశంలో అత్యంత చిన్న వయసున్న రాష్ట్రం తెలంగాణ అని, ఏర్పడి రెండేళ్ళే అయిందని, అయినా ఈ రెండేళ్లలోనే ప్రజల ఆకాంక్షలు పూర్తి చేసేందుకు, ప్రజల అవసరాలు తీర్చేందుకు తెరాస సర్కారు తీసుకుంటున్న చర్యలు విశ్వాసం పెంచాయన్నారు.

గజ్వెల్ బహిరంగ సభ

గజ్వెల్ బహిరంగ సభ

ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందో ఆ స్వప్నాల్ని పూర్తి చేస్తుందనిపిస్తోందని, తెలంగాణలో ఈ రోజు పంచశక్తి దర్శనమైందన్నారు. ఈ సంకల్పంలో నేనూ భాగస్వామినవటం సంతోషంగా ఉందన్నారు.

 గజ్వెల్ బహిరంగ సభ

గజ్వెల్ బహిరంగ సభ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేసే సమాఖ్య వ్యవస్థకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని, ఒకప్పుడు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం ఉండేదన్నారు. ఇప్పుడు పరిస్థితి మారి రెండూ కలసి దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నాయన్నారు.

 గజ్వెల్ బహిరంగ సభ

గజ్వెల్ బహిరంగ సభ

భుజం భుజం కలిపి నడుస్తున్నాయని, దేశాన్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు తెలంగాణ సర్కారుతో కలిసి పని చేస్తామని, విద్యుత్తు, ఎరువులు, రైల్వేలైను, తాగునీటి ప్రాజెక్టుల్లో కలిసి పనిచేసేందుకు అడుగులు వేస్తున్నామన్నారు.

 గజ్వెల్ బహిరంగ సభ

గజ్వెల్ బహిరంగ సభ

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో జరిగిన పెద్ద ఆర్థిక సంస్కరణను (జీఎస్‌టీ) కేసీఆర్‌, ఆయన పార్టీ సమర్థించినందుకు ధన్యవాదాలు అన్నారు.

గజ్వెల్ బహిరంగ సభ

గజ్వెల్ బహిరంగ సభ

ప్రధాని కృషి సించాయీ యోజన పేరుతో దేశంలోని రైతులకు సాగునీటిని అందించాలని నిర్ణయించామని,రైతుకు శక్తినిస్తే వారు మట్టిలో నుంచి బంగారం పండిస్తారని, రైతులకు సాగునీటిని అందించడం గొప్ప మహాకార్యమన్నారు. నీటి వనరులున్నచోట, నదీ తీరప్రాంతంలో, పరీవాహక ప్రాంతంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులు ఎన్నో మూలనపడి ఉన్నాయని, ఆ ప్రాజెక్టులను పూర్తిచేసి రైతులకు సాగునీటిని అందించేందుకు ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టనున్నామన్నారు.

గజ్వెల్ బహిరంగ సభ

గజ్వెల్ బహిరంగ సభ

భారత ఆర్థికశక్తికి మూలమైన గ్రామాలు, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు శ్రద్ధ పెట్టామన్నారు. తెలంగాణ వేదికగా ఇతర రాష్ట్రాలకూ చెబుతున్నానని, నీళ్లున్నప్పుడు మనకు వాటి విలువ తెలియదని, దాహం వేసినప్పుడు... కనుచూపు మేరలో నీటివనరులు కనిపించనపుడు మనిషికి నీటి విలువ తెలుస్తుందన్నారు.

 గజ్వెల్ బహిరంగ సభ

గజ్వెల్ బహిరంగ సభ

నీళ్లుంటే ఉదాసీనత ఉంటుందని, నీటిని కాపాడుకుందామని, ఆ నీటితో కొత్త జీవితం ప్రారంభమవుతుందని, ప్రతి వర్షపు చుక్కనూ ఒడిసి పడదామన్నారు.

 గజ్వెల్ బహిరంగ సభ

గజ్వెల్ బహిరంగ సభ

గతంలో కరెంట్ కష్టాలు ఉండేవని, ఇప్పుడు అవి లేవని ప్రధాని మోడీ అన్నారు. రెండేళ్లలో కోతలున్న రాష్ట్రాలను మిగులు రాష్ట్రాలుగా తీర్చిదిద్దామన్నారు. విద్యుత్తు ఉత్పత్తి పెంచాం, కొత్తలైన్లు వేశామన్నారు. సంకల్పముంటే సమస్యలకు సమాధానం అదే లభిస్తుందన్నారు.

 గజ్వెల్ బహిరంగ సభ

గజ్వెల్ బహిరంగ సభ

మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ కోసం ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురుచూస్తున్నారని, తెలంగాణకు ఎందరో ప్రధానులు వచ్చి వెళ్లారని, వచ్చిన ప్రతిసారీ రైల్వేలైను కోసం అందరినీ అడిగారని, కానీ రైల్వేలైన్‌ దూరంలోకూడా కన్పించలేదని ప్రధాని మోడీ అన్నారు. అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కావాలని, అనుసంధానం కావాలని, ఆర్థిక వ్యవస్థలను అనుసంధానిస్తున్నామని, గతంలో నలుగురు ఎంపీలు అడిగితే ఓ బోగీ అదనంగా ఇచ్చేవారని, మరో నలుగురు తోడైతే కొత్తచోట స్టాప్‌ మంజూరు చేసేవారన్నారు.

గజ్వెల్ బహిరంగ సభ

గజ్వెల్ బహిరంగ సభ

ఇలాగే మనరైల్వే వ్యవస్థ నడిచిందని, ఇప్పుడు ప్రజల అవసరాలను, ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రైల్వేను ముందుకు తీసుకువెళ్లున్నామన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛకు నేడు శంకుస్థాపన చేశామన్నారు. దీనిని నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి చేస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+