Vaikunta Ekadasi: తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో వైకుంఠ ఏకదాశి శోభ.. పోటెత్తిన భక్తులు..
వైకుంఠ ఏకదాశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు చేరుకున్నారు. గుడుల్లో వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో భక్తులు భారీగా చేరుకుంటున్నారు. తిరుమలలో నేటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నారు. ఏపీలో వైష్ణవ ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరిచారు. అన్ని కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు నిండిపోయారు. వైకుంఠ ద్వార దర్శనంతో తిరుమలకు వీఐపీల తాకిడి భారీగా పెరిగింది. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎస్.ఎల్. భట్టి, జస్టిస్ శ్యామ్ సుందర్, జస్టిస్ తారాల రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్‌లు శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేశ్, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.
#WATCH | Tamil Nadu: Devotees thronged to Sri Vaikunta Perumal Temple in Kanchipuram, on the occasion of Vaikunta Ekadasi today.
— ANI (@ANI) December 23, 2023
Vaikunta Ekadasi is observed annually on the eleventh lunar day of Shukla Paksha or Margazhi month of the Hindu calendar. pic.twitter.com/3n87S5LKEc
ఆలయాలన్ని గోవిందా నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇటు తెలంగాణలోని వైష్ణవ ఆలయాలకు భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూ కట్టారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
#WATCH | Tamil Nadu: Devotees thronged to Sri Ranganathaswamy temple in Srirangam, Trichy on the occasion of Vaikunta Ekadasi today; Paramapada Vasal (the seventh gate of heaven) was opened.
— ANI (@ANI) December 23, 2023
Vaikunta Ekadasi is observed annually on the eleventh lunar day of Shukla Paksha or… pic.twitter.com/sbT84e750o
తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇటు హైదరాబాద్ లోని ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ పెరిగింది. జూబ్లీహిల్స్ టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకదాశి వేడకులు నిర్వహించారు. తెల్లవారు జామునుంచే ఉత్తర ద్వారా దర్శనాలు ప్రారంభమయ్యాయి.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications