‘మయోనైజ్’ బిర్యానీ తిని ఒకరు మృతి: గ్రిల్ 9 రెస్టారెంట్ సీజ్
ఆహార ప్రియులు ఇష్టంగా తినే మయోనైజ్ ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది. మయోనైజ్ తయారీలో నాణ్యత పాటించకపోవడమే ఇందుకు కారణం. హైదరాబాద్ నగరంలో ఇటీవలే కలుషితమైన మయోనైజ్ తిని ఒకరు చనిపోగా.. 50 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే మయోనైజ్‌పై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది.
అయినా రాష్ట్రంలో మయోనైజ్ వాడకం ఆగడం లేదు. పలు రెస్టారెంట్లు మయోనైజ్ వంటకాలను కస్టమర్లకు అందిస్తున్నాయి. తాజాగా, నిర్మల్ పట్టణంలో ఓ రెస్టారెంట్‌లో మయోనైజ్ ఆహారం తిని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నిర్మల్ పట్టణంలోని గ్రిల్ 9 రెస్టారెంట్‌లో నవంబర్ 2 పలువురు కస్టమర్లు బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత వీరిలో 20 మందికిపైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరితో పాటు బోథ్‌కు చెందిన ఓ మహిళ ఇదే రెస్టారెంట్‌లో తిన్న తరువాత ఆసుపత్రి పాలై చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు సోమవారమే రెస్టారెంట్ మూసేశారు.
అంతేగాక, అదే రోజు రెస్టారెంట్‌లోని సీసీ ఫుటేజ్ తీసుకెళ్లి ఆధారాలు లేకుండా చేశారు. విషయం తెలిసి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బుధవారం నిందితులను పట్టుకున్నారు. గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు.. పోలీసులు, నిందితుల సమక్షంలో రెస్టారెంట్‌ను తనిఖీ చేశారు. ఏమాత్రం పరిశుభ్రంగా లేని కిచెన్, జిడ్డుకారుతున్న వంట పాత్రలు, పదే పదే వాడుతున్న ఆయిల్, గడువు తీరిన సరుకులను గుర్తించారు.
ఆ తర్వాత మున్సిపల్ అధికారులతో కలిసి ఇంఛార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష రెస్టారెంట్‌ను సీజ్ చేశారు. హోటల్ నిర్వాహకులకు మయోనైజ్ వాడకూడదని సూచించినప్పటికీ వారు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారు. ఆసుపత్రిలో ఉన్న బాధితులు మయోనైజ్ వల్లే ఇదంతా జరిగిందని చెప్పారు. బాధ్యులపై కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.
రెస్టారెంట్‌లోని కాలం చెల్లిన సరుకులు, ఇతర ఆహార పదార్థాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతున్నట్లు ఇంఛార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష తెలిపారు. బిర్యానీ, షవర్మాలో మయోనైజ్ తిన్న తరువాతే తాము అస్వస్థతకు గురైనట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు చెప్పారని తెలిపారు. మరోవైపు, గ్రిల్ 9 నిర్వాహకుల లైసెన్స్ కూడా రెన్యువల్ కాలేదని అధికారులు గుర్తించారు. ఫుడ్ పాయిజన్‌కు కారణమైన నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications