ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు: ఢిల్లీ యువతులు, విటుల అరెస్ట్
హైదరాబాద్: నగరంలో మరో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు అయింది. ఆన్‌లైన్‌లో బుక్ చేస్తూ.. ఢిల్లీ నుంచి యువతులను రప్పిస్తున్నారు. పక్కా సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు.. వ్యభిచారగృహ నిర్వాహకులను పట్టుకున్నారు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. బంజరాహిల్స్‌కు చెందిన రంజిత్ కొంతకాలంగా ఢిల్లీ నుంచి యువతులను రప్పిస్తూ ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షిస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు నిఘా పెట్టారు.
ఈ క్రమంలో రంజిత్ ఢిల్లీనుంచి ఇద్దరు యువతులను రప్పించాడు. ఆన్‌లైన్‌లోనే బంజరాహిల్స్‌లోని శ్రీనగర్‌కాలనీకి చెందిన ఇద్దరు యువకులకు సమయం ఇచ్చాడు.
ఆదివారం రామంతాపూర్ రావాలని సూచించాడు. అతడితో పాటు ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులు, ఈ ముగ్గురు విటులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే మాటువేసి ఉన్న ఎస్‌వోటీ పోలీసులు రంజిత్ సహా అందరినీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నిమిత్తం ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.

రెండు కార్లు ఢీ..ఇద్దరు మృతి
వరంగల్ జాతీయ రహదారిపై నారపల్లిలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.
సిద్దిపేటకు చెందిన రాజిరెడ్డి (50)కుటుంబ సభ్యులతో కలసి మేడిపల్లి భరత్‌పురికాలనీలో ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం తన మారుతీ ఆల్టో కారులో భార్య విజయలక్ష్మి(48), వారి ఇద్దరు కుమారులు రజినీకాంత్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డితో కలసి మేడిపల్లి నుంచి ఘట్‌కేసర్ వైపు వెళ్తున్నారు. నారపల్లిలోని పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకుని ఘట్‌కేసర్ రోడ్డుకు టర్న్ అవుతుండగా వేగంగా ఘట్‌కేసర్ వైపు వెళ్తున్న ఇండికా విస్ట్ కారు ఢీకొట్టింది.
మేడిపల్లికి చెందిన అమరేందర్‌రెడ్డి తన భార్య జ్యోతితో కలసి ఇండికా కారులో ఘట్‌కేసర్ వైపు వెళ్తున్నారు. ఈ ఘటనతో మారుతీలో ఉన్న రాజిరెడ్డి, విజయలక్ష్మి అక్కడికకడే మృతి చెందగా వారి కుమారులు రజినీకాంత్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి.
కారు నడుపుతున్న అమరేందర్‌రెడ్డి, జ్యోతిలకు కూడా తీవ్రగాయాలు కావడంతో వారిని స్థానికులు చికిత్సకోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మేడిపల్లి పోలీసులు మృత దేహాలను పోస్టుమారం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేసున్నారు.












Click it and Unblock the Notifications