తెలంగాణ టిడిపిలో రేవంత్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ వైపు: ఎర్రబెల్లి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా టిఆర్ఎస్ వైపే ఉన్నారని, కేవలం టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని టిఆర్ఎస్ నేత.
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా టిఆర్ఎస్ వైపే ఉన్నారని, కేవలం టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని టిఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు.
తెలంగాణలో టిడిపి నేతలలో రేవంత్ రెడ్డి మినహా ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర రెడ్డి అందరు కూడా తెరాస వైపే ఉన్నారని చెప్పారు. అంతేకాకుండా కేసీఆర్‌కు ఏపీలో కూడా క్రేజ్ ఉందని చెప్పారు.

కాగా, ఇటీవల మోత్కుపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే టిఆర్ఎస్, బిజెపిలతో పొత్తు ఉంటుంది కానీ కాంగ్రెస్‌తో మాత్రం కలమని చెప్పారు. మరోవైపు రేవంత్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు.












Click it and Unblock the Notifications