18ఏళ్ళ తర్వాత ఓరుగల్లులో ఓపెన్ హార్ట్ సర్జరీ.. అభినందించిన మంత్రి హరీష్ రావు
వరంగల్ లోని కాకతీయ వైద్య కళాశాలలో వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఒక హిస్టరీని క్రియేట్ చేశారు. ఒక మైలు రాయిని సృష్టించారు. 18 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఓరుగల్లులో ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించడం ఇదే తొలిసారి. ఇరవై తొమ్మిది నిమిషాలపాటు గుండె ప్రతిస్పందనను ఆపి నిర్వహించిన ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతం కావడం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు.

కేఎంసీలో 18 ఏళ్ళ తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ
వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలోని ప్రధానమంత్రి స్వస్త్య యోజన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లో మొదటి సారి ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. 2004లో ఎంజీఎం ఆస్పత్రిలో ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స నిర్వహించిన తర్వాత, గత 18 సంవత్సరాలుగా మళ్లీ ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించలేదు. 18 ఏళ్ల తర్వాత తొలిసారి మళ్లీ వరంగల్లో నిర్వహించిన ఓపెన్ హార్ట్ శస్త్రచికిత్స విజయవంతమైందని ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు.గతంలో 2004లో అమరావతి ప్రభాకరాచారి ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ సృజన్ ఆధ్వర్యంలోని వరంగల్ వైద్య బృందం ఈ శస్త్రచికిత్స నిర్వహించారు.

29 నిమిషాల పాటు గుండె ప్రతిస్పందన ఆపి ఓపెన్ హార్ట్ సర్జరీ
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన వడ్డేపల్లి స్వప్న అనే 31 సంవత్సరాల మహిళకు 29 నిమిషాల పాటు గుండె ప్రతిస్పందన నిలిపివేసి, ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. హార్ట్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జె సృజన్, డాక్టర్ బి రిషిత్, అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ నాగార్జున రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ జి శ్రవణ్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి చంద్రశేఖర్, డాక్టర్ స్ఫూర్తి, డాక్టర్ ప్రవళిక , ఆర్ఎంఓ డాక్టర్ మురళి, డాక్టర్ రహియా, నర్సింగ్ సూపరిండెంట్ సుశీల వైద్యుల బృందం మూడు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆపరేషన్ సక్సెస్ అయిందని ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.

ఓపెన్ హార్ట్ సర్జరీ పై మంత్రి హరీష్ రావు హర్షం
ఓపెన్ హార్ట్ సర్జరీ ను విజయవంతం చేసిన వైద్యుల బృందాన్ని మంత్రి హరీష్ రావు అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య శాఖ తీస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని పేర్కొన్న మంత్రి హరీష్ రావు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీ పై మాట్లాడిన ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు వైద్యులకు కల్పించడం, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి వైద్యులకు కావలసిన వనరులను అందించటం తోనే తాము ఓపెన్ హార్ట్ సర్జరీ చేయగలిగామని చెప్పారు.

ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఓపెన్ హార్ట్ సర్జరీ
ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి తమని ప్రోత్సహించిన మంత్రి హరీష్ రావుకు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వైద్యుల కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఆస్పత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న స్వప్న సోదరి రమ వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ప్రాణాలు కాపాడారని తెలిపారు. ప్రస్తుతం తన సోదరి ఆరోగ్యంగా ఉందని స్వప్న సోదరి రమ తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications