Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ తప్పు మాది కాదు.. కేంద్రానిదే: తెలంగాణ మంత్రి లేఖ

తెలంగాణలో తలెత్తిన ఎరువుల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టత ఇచ్చారు. దీనిపై రాష్ట్ర రైతాంగానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. కొరత ఏర్పడటానికి గల కారణాలు, ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఇతర రాష్ట్రాల్లో నెలకొన్న పరిణామాల గురించి ఇందులో ప్రస్తావించారు.

యూరియా కొరతకు ప్రధాన కారణాలు దిగుమతి సమస్యలు, దేశీయ ఉత్పత్తిలో తలెత్తిన లోపాలేనని మంత్రి వివరించారు. ఏప్రిల్-ఆగస్టు కాలానికి తెలంగాణకు 3.94 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి చేసుకున్న యూరియాను కేంద్రం రాష్ట్రానికి కేటాయించిందని తెలిపారు.

Open Letter to Telangana Farmers by the Minister on Urea Shortage

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్-ఇజ్రాయెల్ సంక్షోభం, ఎర్రసముద్రంలో షిప్పింగ్ అంతరాయాల కారణంగా రాష్ట్రానికి కేటాయించిన స్టాక్‌లో చాలా వరకు రాలేదని వివరణ ఇచ్చారు. ఇప్పటివరకు కేవలం 2.10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే సరఫరా అయ్యాయని పేర్కొన్నారు.

దేశీయ ఉత్పత్తి విషయానికి వస్తే- కేంద్రం ప్రధానంగా రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి యూరియాను రాష్ట్రానికి కేటాయించిందని, ఇందులో 1.69 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 1.06 మాత్రమే సరఫరా అయిందని తెలిపారు. మే నుండి 78 రోజుల పాటు రామగుండం ఫర్టిలైజర్స్ మూతపడటం వల్ల 62,000 మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడిందని మంత్రి వివరించారు.

ఈ రెండు అంశాలు- దిగుమతిలో చోటు చేసుకున్న జాప్యం, దేశీయ ఉత్పత్తిలో చోటు చేసుకున్న లోపాల వల్ల తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా యూరియా కొరతకు దారితీశాయని ఆయన స్పష్టం చేశారు. ఈ వాస్తవ పరిస్థితులను బీజేపీ నాయకులు దాచిపెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని తుమ్మల అన్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కూడా యూరియా కొరతతో ఉందని, అక్కడి ప్రభుత్వాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయని తుమ్మల విమర్శించారు. నిరసనల పేరుతో బీఆర్ఎస్ డ్రామాలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రైతులను చెప్పులతో పాటు క్యూలో నిలబెట్టడం, నకిలీ యూరియా సంచులను పంపిణీ చేయడం ద్వారా తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దిగుమతి అంతరాయాలను ముందుగానే ఊహించి, కేంద్రానికి పదేపదే విజ్ఞప్తులు చేశామని తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేశారు. కేంద్రానికి ఏడు లేఖలు రాశామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారని ఆయన అన్నారు.

తెలంగాణ ఎంపీలు ఢిల్లీలో నిరసనలు తెలిపి, కేంద్ర మంత్రులను కలిశారని గుర్తుచేశారు. ఈ ఒత్తిడి కారణంగా- కేంద్రం 50,000 మెట్రిక్ టన్నులు ఇస్తామని హామీ ఇచ్చిందని, అందులో 35,000 మెట్రిక్ టన్నులు ఇప్పుడే వచ్చాయని మంత్రి వెల్లడించారు.

దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి సారించామని తుమ్మల తెలిపారు. పర్యావరణ అనుకూల, తక్కువ ఖర్చుతో కూడుకున్న నానో యూరియా వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువుల మధ్య ధర వ్యత్యాసాన్ని తగ్గించాలని కోరారు. దేశీయ యూరియా ఉత్పత్తిని బలోపేతం చేయాలని కేంద్రానికి డిమాండ్ చేయాలని మంత్రి అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+