మున్సిపల్ ఎన్నికలపై సమావేశంలో పార్టీల రచ్చ: కాంగ్రెస్ వాకౌట్, గందరగోళం

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్వహించిన సమావేశం రసాభాస అయ్యింది. రిజర్వేషన్లు ప్రకటించకుండా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఇవ్వడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి.

ఈ సమావేశంలో ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అభ్యర్థుల వ్యయం తదితర అంశాలపై చర్చ జరిగినప్పటికీ.. తమ అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

opposition parties fires at telangana election commissioner of municipal elections issue

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నాగిరెడ్డి టీఆర్ఎస్‌కు అనుకూలంగా నియంతలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ మండిపడింది. ఉద్దేశపూర్వకంగా మున్సిపల్ ఎన్నికలను జాప్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు హడావుడి నిర్వహిస్తోందని తెలుగుదేశం ప్రతినిధులు ఆరోపించారు.

ఎన్నికల సంఘం రాష్ట్ర సర్కారు కనుసన్నల్లో పనిచేస్తోందని బీజేపీ ఆరోపించింది. అయితే, ప్రలోభాలకు తావివ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తామన్న నమ్మకుండా లేకుండా పోయిందని పేర్కొంది. మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడే జరగరాదని కోరుకున్న ప్రతిపక్షాలు ఓటమికి సాకులు వెతుకుతు
న్నాయని అధికార టీఆర్ఎస్ మండిపడింది.

కాగా, సమావేశంలో గందరగోళం తలెత్తడంతో దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు కృష్ణస్వరూప్‌ను పోలీసుల సాయంతో బయటకు పంపించారు. తనపై ఎన్నికల సంఘం అధికారులు దాడి చేశారని, వారిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు పెట్టాలని కృష్ణస్వరూప్ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+