OSCAR 2023: నామినేషన్లో నాటు నాటు పాట; బండి సంజయ్‌తో రాహుల్ సిప్లిగంజ్ సెలబ్రేషన్స్!!

OSCAR 2023కు ఆర్ఆర్ఆర్ నాటు నాటు నామినేట్ కావటంతో పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ కు ప్రశంసలు వెల్లువగా మారాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాహుల్ సిప్లిగంజ్ ను సన్మానించి అభినందించారు.

దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో సంచలనం సృష్టించిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ నామినేషన్ లో నిలవడం ఇప్పుడు అందరి మన్ననలు పొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు అనేక అవార్డుల సునామీ కొనసాగుతుండగా, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ నామినేషన్స్ లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా స్థానం దక్కించుకోవడం ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది.

ఆస్కార్ నామినేషన్స్ లో నాటు నాటు పాట.. రాహుల్ సిప్లిగంజ్ కు ప్రశంసలు

ఆస్కార్ నామినేషన్స్ లో నాటు నాటు పాట.. రాహుల్ సిప్లిగంజ్ కు ప్రశంసలు


ఆస్కార్ నామినేషన్ లో స్థానం సంపాదించుకున్న తొలి తెలుగు పాటగా నాటు నాటు పాట రికార్డు సృష్టించింది. ఇక ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రాతకు, రాహుల్ సిప్లిగంజ్ గాత్రం , ఇక ఈ కాంబినేషన్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేయడం వెరసి ఈ పాట అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఆస్కార్ నామినేషన్ లో ఈ పాట ఎంపిక కావడంతో రాహుల్ సిప్లిగంజ్ కు ప్రశంసలు వెల్లువగా మారాయి. ఇక ఈ సినిమాలో తను పాడిన పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ కావటంతో రాహుల్ సిప్లిగంజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఒకింత సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు.

రాహుల్ సిప్లిగంజ్ ను సన్మానించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాహుల్ సిప్లిగంజ్ ను సన్మానించారు. ఆయనకు స్వీట్లు తినిపించి నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేషన్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. ఇక ఇదే సమయంలో ఆయన తాను పెట్టిన పోస్టులో ప్రతిభతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ప్రియమైన రాహుల్‌సిప్లిగంజ్‌తో కలిసి నాటు నాటు పాట కోసం ఆస్కార్ నామినేషన్ యొక్క పెద్ద విజయాన్ని జరుపుకున్నానని పేర్కొన్నారు. మా సొంత హైదరాబాద్ కుర్రాడు పాడిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాటలను వినాలని బండి సంజయ్ పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా పేరు గడించాలని ఆకాంక్ష

అంతర్జాతీయంగా పేరు గడించాలని ఆకాంక్ష

ఆర్ ఆర్ ఆర్ సినిమా బృందానికి అభినందనలు తెలియజేసిన, బండి సంజయ్ రాహుల్ సిప్లిగంజ్ ను ఓ రేంజ్ లో ప్రశంసించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు బిజెపి నేతలు రాహుల్ సిప్లిగంజ్ ను సత్కరించారు. ముందు ముందు భవిష్యత్తులో మరిన్ని మంచి పాటలు పాడి, అంతర్జాతీయంగా పేరు గడించాలని సూచించారు. ఒక తెలుగు పాట ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్లి చరిత్ర సృష్టించగా,అవార్డు దక్కించుకోవాలని పలువురు ఆశిస్తున్నారు. అంతేకాదు భవిష్యత్తులో మరిన్ని చరిత్రలను సృష్టించేలా తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ప్రయోగాలు జరగాలని పలువురు ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+