అరికెపూడి గాంధీ ఇంటికి పాడి కౌశిక్ రెడ్డి ముహూర్తం ఫిక్స్... వదిలిపెట్టనని హెచ్చరిక!
అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిని ముట్టడించి దాడికి ప్రయత్నం చేయడంతో ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అరికెపూడి గాంధీ అనుచరులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద టమాటాలు, కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు.
రేపు అరికెపూడి గాంధీ ఇంటికి పాడి కౌశిక్ రెడ్డి
అరికెపూడి గాంధీచరులతో కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ పైన పోలీసుల పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చర్యకు ప్రతి చర్య తప్పకుండా ఉంటుందని పేర్కొన్న పాడి కౌశిక్ రెడ్డి రేపు ఉదయం 11 గంటలకు అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి నిరసన తెలుపుతామని కెసిఆర్ అభిమానులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.

చంపేందుకు ప్రయత్నం చేశారు
దాడి చేస్తే పారిపోయే వ్యక్తిని కాదని ,తాను ఎవరికీ భయపడబోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గుండాలు తనపై హత్యాయత్నం చేశారని తన ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారని, చంపేందుకు ప్రయత్నం చేస్తే పోలీసులు చోద్యం చూశారని విమర్శించారు. మేము ఏంటో కూడా చూపిస్తాం అంటూ పేర్కొన్న ఆయన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే కే రక్షణ లేదని, సామాన్య ప్రజలకు ప్రభుత్వం ఎలా రక్షణ కల్పిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
వదిలిపెట్టేది లేదు.. హెచ్చరించిన పాడి కౌశిక్ రెడ్డి
ప్రజా పాలన అంటే ఇదేనా రేవంత్ రెడ్డి అంటూ సీఎంని నిలదీశారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, పార్టీ మారిన నేతలసంగతి అప్పుడు చూస్తామని హెచ్చరికలు జారీచేశారు. ఇప్పుడు జరిగిన దాన్ని గుర్తుపెట్టుకుంటామని అసలుతో పాటు వడ్డీ కలిపి చెల్లిస్తామని తెలిపారు. కేసీఆర్ సీఎం కావడం ఖాయమని అప్పుడు మీ భరతం పట్టడం ఖాయమని ఇది రాసి పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
సినిమా చూపిస్తాం అంటున్న పాడి కౌశిక్ రెడ్డి
వారికి నాలుగేళ్ల తర్వాత సినిమా చూపిస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్షానికి పీఏసీ ఇవ్వడం ఆనవాయితీ అని పేర్కొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ దాఖలు చేసిన నామినేషన్లు ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. అసలు నామినేషన్ దాఖలు చేయని అరికెపూడి గాంధీకి దొంగ చాటున పీఏసీ ఎలా ఇస్తారంటూ నిలదీశారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని రేపు అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్ళేది ఖాయమని ఆయన తేల్చి చెప్పారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications