ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కీలక పిలుపు ...పాకిస్తాన్ ఉగ్రదాడి వేళ..!

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామనే సందేశాన్ని పంపడానికి శుక్రవారం మసీదులకు ప్రార్థనలకు వెళ్లే సమయంలో ముస్లింలు తమ చేతులకు నల్ల రిబ్బన్ లేదా బ్యాండ్ ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

'పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తొయిబా ఉగ్రవాదులు పహల్గాంలో 26 ంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్నారు. ఈ ఉగ్రవాద చర్యను ఖండిస్తూ.. మీరు రేపు ప్రార్థనలకు వెళ్లే సమయంలో దయచేసి మీ చేతికి నల్లటి బ్యాండ్ ధరించండి' అని కోరుతూ అసదుద్దీన ఒవైసీ ఓ వీడియోలో ముస్లింలకు పిలుపునిచ్చారు.

Pahalgam terror attack Asaduddin Owaisi calls on Muslims to wear black bands during Friday prayers

ఇలా చేయడం ద్వారా విదేశీ శక్తులు భారతదేశ శాంతి, ఐక్యతను బలహీనపరచనివ్వబోమని మనం భారతీయులందరికీ సందేశం పంపుదాం అంటూ అసదుద్దీన్ ఒవైసీ హిందీలో ట్వీట్ చేశారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. మతం పేరుతో ప్రాణాలు తీయడం దారుణమని వ్యాఖ్యానించారు.

మరోవైపు, గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరయ్యారు. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం నుంచి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

అఖిలపక్ష సమావేశం అనంతరం అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించే దేశంపై కేంద్ర ప్రభుత్వం ఏ చర్య అయినా తీసుకోవచ్చు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ కోసం వైమానిక, నావికా దిగ్బంధనం చేయడానికి, ఆయుధ అమ్మకాలపై పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించడానికి అంతర్జాతీయ చట్టం కూడా అనుమతిస్తుంది అని పేర్కొన్నారు.

బైసారన్ ప్రాంతంలో CRPFని ఎందుకు మోహరించలేదు?... త్వరిత ప్రతిచర్య బృందం అక్కడికి చేరుకోవడానికి ఒక గంట సమయం ఎందుకు తీసుకుంది? అని ఒవైసీ ప్రశ్నించినట్లు తెలిపారు. ఉగ్రవాదులు మతాన్ని అడిగి చంపడాన్ని తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేయడం సరైన చర్యే అని అన్నారు. అయితే, ఆ నీటిని ఎక్కడికి తరలిస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాము మద్దతు ఇస్తామని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఇది రాజకీయ సమస్య కాదని వ్యాక్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+