ఇద్దరు తెలంగాణ వాసులను దారుణంగా నరికి చంపిన పాకిస్తానీ.. ఎక్కడంటే ?
మత విద్వేషం కారణంగా తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులను పాకిస్తాన్ కి చెందిన ఓ వ్యక్తి దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు సైతం గాయపడినట్టు సమాచారం. ఈ హృదయ విదారకర ఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది. గత శుక్రవారం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన ప్రేమ్ సాగర్ (40), నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ ఉన్నారు. వీరిద్దరూ దుబాయ్‌లోని మోడ్రన్ బేకరీలో పనిచేస్తున్నారు. ప్రేమ సాగర్ జీవనోపాధి కోసం గత ఆరు సంవత్సరాలుగా బేకరీలో పని చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం స్వదేశానికి వచ్చిన ఆయన తిరిగి ఉద్యోగం కోసం మళ్లీ దుబాయ్ వెళ్లారు. అయితే అదే బేకరీలో పని చేస్తున్న పాకిస్తానీ వ్యక్తి.. వారిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు.

ఈ ఘటన మత వివాదం కారణంగా జరిగిందని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ అమానుష ఘటనతో దుబాయ్‌లోని భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం అక్కడి అధికారులు ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications