TS RTC: ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఆ జిల్లాల్లో పల్లె వెలుగు టౌన్ బస్ పాస్..
తెలంగాణ ఆర్టీసీ వినూత్న నిర్ణయాలతో ముందుకెళ్తోంది. తాజాగా పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ తీసుకొచ్చింది. పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ ను మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో జారీ చేయనున్నారు. ఇక్కడ విజయవంతమైతే తెలంగాణ వ్యాప్తంగా పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ ఇవ్వనున్నారు.
పల్లె వెలుగు టౌన్ బస్ తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్ నగర్ లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో ఎన్నిసార్లైనా ప్రయాణం చేసే అవకాశం ఉంది. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా ఛార్జ్ చేస్తున్నారు.

హైదరాబాద్ లోని బస్ భవన్‌లో సోమవారం "పల్లె వెలుగు టౌన్ బస్ పాస్" పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలో మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ పాస్ కు సంబంధించి పూర్తి వివరాల కోసం 040-69440000, 040-23450033కు ఫోన్ సంప్రదించవచ్చు.
ఇటు జంట నగరాలకు సంబంధించి ఆర్టీసీ ఓ నిర్ణయం తీసుకుంది. ఎయిర్ పోర్టుకు వెళ్లే వారి సంఖ్య ముగ్గురి కంటే ఎక్కువు ఉంటే.. టికెట్లపై 10 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ముగ్గురికి మించి ఎంత మంది ప్రయాణం చేసిన టికెట్ల 10 శాతం సబ్సిడీ ఉంటుందని ఆర్టీసీ ప్రకటించింది. ప్రైవేట్ వాహనాల పోటీ తట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications