తెలంగాణలో పవన్ కీలక నిర్ణయాలు!: పక్కా ప్లాన్‌తో ముందుకు, వారికే ప్రాధాన్యం

హైదరాబాద్/కరీంనగర్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. పవన్ పర్యటన తెలుపు రంగు ఫోర్డ్ కారులో సాగనుంది. పవన్ తెలంగాణలో యాత్రను వ్యూహాత్మకంగా ప్రారంభించారని తెలుస్తోంది.

Recommended Video

    కాంగ్రెసుకు గుబులు, తెలంగాణలో పవన్ పక్కా ప్లాన్‌ !

    తెలంగాణ పర్యటనలో పవన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది. గతంలో తెలంగాణలో ఆయన తన అభిమానులు, జనసేన నాయకులతో సమావేశాలు నిర్వహించారు. గత ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణలో రాజకీయపరమైన పర్యటన ఇది.

    పార్టీలో ఎక్కువ తక్కువ లేకుండా

    పార్టీలో ఎక్కువ తక్కువ లేకుండా

    రెండు నెలల క్రితం పవన్ కళ్యాణ్ కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీకి ఎంత సమయం కేటాయిస్తారు, వారి వ్యక్తిగత వివరాలను సేకరించారు. పార్టీలో ఎక్కువ, తక్కువ అనే బేధాలు లేవని అందరూ సమానమేనని ఆయన సూచించారు.

    కిందిస్థాయి నుంచి కలుపుకొని వెళ్లేవారికి

    కిందిస్థాయి నుంచి కలుపుకొని వెళ్లేవారికి

    రెండు నెలల కిందటే కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాలో అభిమానులు, పార్టీకార్యకర్తలతో సమావేశం నిర్వహించి.. ఇప్పుడు పక్కాగా పర్యటన ప్లాన్ చేసుకున్నారని చెప్పవచ్చు. అంతేకాదు, తనతో కంటే కిందిస్థాయి నుంచి కలుపుకొని వెళ్లేవారికి ప్రాధాన్యం పవన్ ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది.

    త్వరలో ఇంచార్జిలు

    త్వరలో ఇంచార్జిలు

    ప్రజల్లో తిరిగి సమస్యలను అధికారులకు వివరించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని, రాజకీయ విమర్శలు చేయరాదని మొదటి నుంచి కార్యకర్తలకు సూచిస్తున్నారు పవన్ కళ్యాణ్. త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థాయి ఇంచార్జిలను ఎంపిక చేయనున్నారు. వారికి హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ తరగతులు ఇప్పించనున్నారు.

    పార్టీ విధివిధానాల ప్రకటన

    పార్టీ విధివిధానాల ప్రకటన


    పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అనంతరం పార్టీ విధివిధానాలు ప్రకటించనున్నారు. 2009లో ఎన్నికల ప్రచారం సమయంలో అంజన్న ఆశీస్సులతో తనకు ప్రమాదం తప్పిందని పవన్ చెప్పిన విషయం తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+