ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు త‌ప్పిన ప్ర‌మాదం?- లాస్ట్ మినిట్ లో అలర్ట్ తో..!

ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ తెలంగాణలో పర్యటిస్తున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చిన పవన్.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని బయలుదేరుతున్న పవన్ కళ్యాణ్ ఓ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. దీంతో ఆయన్ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

జ‌గిత్యాల జిల్లా కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామి ఆలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్.. అక్కడి నుంచి బయలుదేరారు. అక్కడికి భారీగా తరలివచ్చిన అభిమానుల్ని పలకరించేందుకు ఆయన ప్రయాణిస్తున్న కారుపైకి ఎక్కారు. అయితే అభిమానుల తాకిడితో ఆ మార్గంలో ఉన్న కరెంటు తీగల్ని ఆయన గమనించలేదు. దీంతో వాటికి దగ్గరగా వెళ్లిపోయారు. చివరి నిమిషంలో అప్రమత్తమైన పవన్ కారుపై కూర్చునే కిందకు వంగారు. అలా కరెంటు తీగలు తగలకుండా లాస్ట్ మినిట్ లో తప్పించుకున్నారు.

pawan kalyan narrowly escapes electric shock in kondgattu tour

అంతకు ముందు పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వస్తున్నారని ముందే తెలియడంతో అభిమానులు ఆయన్ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో కొండగట్టుకు వెళ్లే మార్గం అంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. పూజల తర్వాత వెనుదిరిగే క్రమంలో అభిమానుల్ని పలకరించాలని నిర్ణయించుకున్న పవన్ కారు పైకి ఎక్కి కూర్చున్నారు. గతంలోనూ పలుమార్లు పవన్ ఇలా కారుపైకి ఎక్కి కూర్చుని అభిమానుల్ని పలకరించిన సందర్భాలున్నాయి. కానీ ఇక్కడ విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండటంతో ప్రమాదపు అంచులవరకూ వెళ్లారు. కానీ చివరి నిమిషంలో అప్రమత్తతో ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+