అల్లు అర్జున్ ఎదుట జై పవన్ కల్యాణ్ అంటూ నినాదాలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన నటించిన పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది. ఈక్రమంలో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీంతో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అల్లు అర్జున్ తరుఫున హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరుఫున లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. అల్లు అర్జున్ తరుఫున లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Pawan Kalyan slogans in front of Allu Arjun in the court

నిరంజన్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిరంజన్ రెడ్డి గతంలో వైసీపీ అధినేత, మాజీ ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసును నిరంజన్ రెడ్డినే వాదించారు. ఇదిలా ఉంటే నాంపల్లి కోర్టు ఆవరణలో అల్లు అర్జున్‌కు ఊహించని సంఘటన ఎదురైంది. నాంపల్లి కోర్టు ఆవరణలో అల్లు అర్జున్ ఎదుటే జై పవర్ స్టార్ అంటూ నినాదాలు వినిపించాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+