మంత్రి, ఎమ్మెల్యేల వివాదాల పై ఏఐసీసీకి కీలక నివేదిక- నెక్స్ట్ ఇక...!!
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో కొంత కాలంగా నేత ల పంచాయితీ సమస్యగా మారుతున్నాయి. కలిసి కట్టుగా సాగాలని పార్టీ నాయకత్వం ఎన్ని సార్లు సూచించినా.. కొందరు నేతల తీరు మారటం లేదు. వారి మధ్య వివాదాలు.. చేస్తున్న వ్యాఖ్యలు అధికారంలో ఉన్న పార్టీ నాయకత్వానికి కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. దీంతో.. ఈ నేతల తీరు పైన పీసీసీ చీఫ్ ఏకంగా ఏఐసీసీకి నివేదిక పంపారు. ఇందులో కీలక అంశాలను ప్రస్తావించారు. దీంతో, ఇప్పుడు ఢిల్లీ నాయకత్వం తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక చర్యలకు రంగం సిద్దం అవుతోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగు తున్న పంచాయతీలపై ఏఐసీసీకి రిపోర్ట్ చేరింది. అన్ని పంచాయతీలపై ముందస్తు సమాచారం తో అధిష్ఠానానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రిపోర్ట్ పంపించారు. మంత్రి దామోదర రాజ నర్సింహ, ఎమ్మెల్యే లక్మీకాంతరావులకు మధ్య జరిగిన వివాదంపై నివేదిక పంపారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా రిపోర్ట్ లో వివరించారు. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ అంశాన్ని హైకమాండ్‌కు చేరవేశారు. అంతేకాకుండా పెద్దపల్లిలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ అధిష్ఠానానికి పీసీసీ చీఫ్ రిపోర్ట్ పంపారు. పార్టీలో ఎక్కడెక్కడ గొడవలు, ఇబ్బందులు ఉన్నాయి.. అలాగే ఆధిపత్య పోరు ఎక్కడ ఉందనే దానిపై లిస్ట్ అవుట్ చేసినట్లు సమాచారం.

ఏఐసీసీ చర్యల పైన ఉత్కంఠ
కాగా.. త్వరలోనే అన్ని పంచాయతీలపై ఇరువర్గాలతో మాట్లాడి పూర్తి నివేదికను పీసీసీ చీఫ్ తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఇబ్బందులన్నింటినీ పరిష్క రించే యోచనలో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఉన్నట్లు తెలుస్తోంది. దాంట్లో భాగంగా ఢిల్లీ వేదికగా మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్మీకాంతరావు మధ్య నెలకొన్న వివాదాన్ని సర్దుమణిగించేందుకు ప్రయత్నం చేశారు. అయితే నిన్న కేబినెట్ సమావేశం ఉండటంతో మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీభవన్‌కు రాలేదు. ఎంపీ వంశీ కృష్ణ, మంత్రి శ్రీధర్ బాబు మధ్య చాలా రోజులుగా కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి గాంధీ భవన్ కు రావాలని టీపీసీసీ సూచన చేసింది. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి అవ్వటం.. మరో రెండేళ్ల కాలంలో తిరిగి ఎన్నికలకు వెళ్లాల్సి ఉండటంతో.. పార్టీలో ఇక.. క్రమశిక్షణా రాహిత్యం కొనసాగకుండా చర్యలకు సిద్దం అవుతున్న వేళ.. ఏఐసీసీ తీసుకునే నిర్ణయం పార్టీ లో ఉత్కంఠ ను పెంచుతోంది.













Click it and Unblock the Notifications
