బాలుడి ఛాతిలో గుచ్చుకున్న పెన్సిల్: తొలగించిన వైద్యులు(పిక్చర్స్)

హైదరాబాద్: ఛాతిలో పెన్సిల్ గుచ్చుకుని విషమ పరిస్థితిలో వైద్యశాలలో చేరిన ఓ బాలుడికి మ్యాక్స్‌క్యూర్ వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. ఛాతిలో దాదాపు 5 ఇంచుల లోపలిదాకా వెళ్లిన ఆ పెన్సిల్‌ను తొలగించారు. మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్ వైద్యశాలలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు సమీర్ దివాలే, రమేష్‌లు ఈ మేరకు ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలం పదహారు చింతల గ్రామానికి చెందిన మోతీలాల్, శిరీష దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు సాయిప్రియ (8), చరణ్(6) స్థానికంగా ఉండే సిద్ధార్థ మోడల్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం స్కూల్ ముగిసిన వెంటనే వ్యాన్‌లో ఎక్కేందుకు తరగతి నుంచి చరణ్ పరిగెత్తుకుని వచ్చాడు.

స్కూల్ ఆవరణలోకి రాగానే కిందపడ్డాడు. ఇదే క్రమంలో చొక్కా జేబులో పెట్టుకున్న పెన్సిల్ ఛాతిలో బలంగా గుచ్చుకుంది. ఇది గమనించిన పాఠశాల అధ్యాపకులు వెంటనే చరణ్‌ను స్థానికంగా ఉన్న వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు చరణ్‌ను తరలించాలని ఆ వైద్యశాల సిబ్బంది సూచించడంతో మోతీలాల్ దంపతులు అతన్ని వరంగల్ ఎంజీఎం వైద్యశాలకు తీసుకెళ్లారు.

బాలుడి పరిస్థితిని గమనించిన ఎంజీఎం వైద్యులు అతన్ని మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్‌కు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో చరణ్‌ను అతని తల్లిదండ్రులు, బంధువులు శనివారం తెల్లవారుజామున నగరానికి తీసుకువచ్చారు. దాదాపు 45 నిమిషాల పాటు సర్జరీ కొనసాగిందని, ఛాతిలో గుచ్చుకున్న పెన్సిల్ గెండెలోకి దాదాపు 1 సెం.మీ లోపలి వరకు వెళ్లిందని వైద్యులు సమీర్ దివాలే, రమేష్‌లు తెలియజేశారు.

చికిత్స అనంతరం బాలుడు

చికిత్స అనంతరం బాలుడు

ఛాతిలో పెన్సిల్ గుచ్చుకుని విషమ పరిస్థితిలో వైద్యశాలలో చేరిన ఓ బాలుడికి మ్యాక్స్‌క్యూర్ వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు.

ఛాతిలో గుచ్చుకున్న పెన్సిన్

ఛాతిలో గుచ్చుకున్న పెన్సిన్

ఛాతిలో దాదాపు 5 ఇంచుల లోపలిదాకా వెళ్లిన ఆ పెన్సిల్‌ను తొలగించారు.

ఛాతిలో గుచ్చుకున్న పెన్సిన్

ఛాతిలో గుచ్చుకున్న పెన్సిన్

మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్ వైద్యశాలలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు సమీర్ దివాలే, రమేష్‌లు ఈ మేరకు ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఛాతిలోంచి తీసిన పెన్సిల్

ఛాతిలోంచి తీసిన పెన్సిల్

ఛాతిలో గుచ్చుకున్న పెన్సిల్ గెండెలోకి దాదాపు 1 సెం.మీ లోపలి వరకు వెళ్లిందని వైద్యులు సమీర్ దివాలే, రమేష్‌లు తెలియజేశారు. అయినప్పటికీ పెన్సిల్‌ను తొలగించామన్నారు.

అయినప్పటికీ పెన్సిల్‌ను తొలగించామన్నారు. కాగా, మోతీలాల్, శిరీషల కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న వైద్యశాల యాజమాన్యం వారి నుంచి ఎలాంటి రుసుం తీసుకోకుండానే ఉచితంగా శస్త్ర చికిత్స చేసేందుకు అంగీకరించింది. ఆపరేషన్ విజయవంతం కావడంతో చరణ్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. వైద్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+