జాగ్రత్త!: ‘ఒక్కరోజులోనే కోటీశ్వరులు కావాలనుకోవద్దు’
రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావాలని కోరుకోకూడదని, దీని వల్ల నష్టమే ఎక్కువగా ఉంటుందని తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ ప్రజలకు సూచించారు.
హైదరాబాద్: రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావాలని కోరుకోకూడదని, దీని వల్ల నష్టమే ఎక్కువగా ఉంటుందని తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మ ప్రజలకు సూచించారు. ఎక్కువ రాబడి వస్తుందన్న పథకాలను నమ్మవద్దని, వీటివల్ల మోసపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) ఆధ్వర్యంలో బ్యాంకింగేతర సంస్థల కార్యకలాపాలు-ఖాతాదారుల రక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశంపై బుధవారం తెలంగాణ పోలీసుశాఖ, సీఐడీ విభబాగానికి శిక్షణ నిర్వహించారు. అనురాగ్‌శర్మ ఇందులో పాల్గొని ప్రసంగించారు.
నకిలీ చిట్‌ఫండ్లు, గొలుసుకట్టు వ్యాపార పథకాల వంటి ఆర్థిక నేరాల విషయంలో పోలీసులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యం మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు.

ఆర్థిక నేరాలు, మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీంలు, కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్స్ స్కీమ్స్, బోగస్ చిట్ ఫండ్స్‌పై పోలీసు అధికారులు కూడా అవగాహన కలిగి ఉండాలని డీజీపీ చెప్పారు.
ఇటీవల కాలంలో ఆన్‌లైన్ పేమెంట్స్, మొబైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరిగినందున నేరాలు కూడా పెరిగే అవకాశం ఉందని, వీటిపైనా దృష్టి సారించాలని అన్నారు. పోలీసులు, నియంత్రణా సంస్థలైన ఆర్బీఐ, సెబీ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ మొదలగునవి ఈ విధమైన నేరాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
-
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు












Click it and Unblock the Notifications