వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్ ఇచ్చిన పెంపుడు కుక్క; లక్షా యాభైవేలు మాయం; లబోదిబోమన్న యజమాని

|
Google Oneindia TeluguNews

వరంగల్ జిల్లాలో ఓ పెంపుడు కుక్క చేసిన పని యజమానికి ఊహించని షాక్ ఇచ్చింది. ఇంటికి విశ్వాసంగా కాపలా కాసే కుక్క దానికున్న అలవాటుతో యజమానికి ధననష్టం తీసుకొచ్చింది. అది చేసిన పనికి ఊరంతా తిరిగినా ఫలితం లేకపోయింది. కుక్క చేసిన పనికి దానిని కొట్టలేక తిట్టలేక దిక్కుతోచని స్థితిలో యజమాని లబోదిబోమన్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే

అలవాటులో పొరబాటుగా యజమానికి నష్టం చేసిన కుక్క

అలవాటులో పొరబాటుగా యజమానికి నష్టం చేసిన కుక్క

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలో ఓ గొర్రెల కాపారి పెంచుకుంటున్న కుక్క అలవాటులో పొరపాటుగా యజమానికి నష్టం చేసింది. నాచినపల్లి గ్రామానికి చెందిన కాసు చేరాలు అనే గొర్రెల కాపరి ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే ఆ కుక్కకు అందేలా ఏదైనా వస్తువులు, సంచులు పెడితే నోటితో ఎత్తుకుని పోయే అలవాటు ఉంది.

ఇక ఈ విషయాన్ని మర్చిపోయిన యజమాని కాసు చేరాలు తన గొర్రెల మందలో గొర్రెలను అమ్మగా వచ్చిన లక్షా యాభై వేల రూపాయలున్న డబ్బుల సంచీని ఇంట్లో ఒక పక్కన పెట్టి స్నానం చేయడానికి వెళ్ళాడు.

డబ్బుల సంచీని ఎత్తుకెళ్ళిన కుక్క .. ఊరంతా వెతికిన యజమాని

ఆ సంచీలో లక్ష 50 వేల రూపాయల నగదు ఉందన్న విషయం తెలియని కుక్క అలవాటు ప్రకారం ఆ సంచిని ఎత్తుకెళ్ళింది. స్నానం చేసి వచ్చి చూసేసరికి తన పెంపుడు కుక్క, పైసల సంచి రెండూ కనిపించలేదు. తాను పెంచుకుంటున్న కుక్కకు ఏవైనా సంచులు కనిపిస్తే ఎత్తుకెళ్లే అలవాటు ఉందని గుర్తొచ్చిన యజమాని కుక్క కోసం వీధుల్లోకి పరుగులు తీశాడు.

కుక్క ఎక్కడుందో గుర్తించి సంచి కోసం ఊరంతా వెతికాడు. కుక్క పైసల సంచీ ఎవరింటి దగ్గర విడిచిపెట్టిందో అర్థం కాక కాసు చేరాలు ఊరంతా తిరిగాడు. ఎక్కడ తిరిగినా డబ్బుల సంచి జాడ కనిపించలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక గ్రామ సర్పంచి వద్దకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పుకున్న చేరాలు, తన డబ్బులు పోయాయి అంటూ లబోదిబోమన్నాడు.

వాట్సప్ గ్రూప్ లో గ్రామ సర్పంచ్ రిక్వెస్ట్ .. లబోదిబోమన్న యజమాని

వాట్సప్ గ్రూప్ లో గ్రామ సర్పంచ్ రిక్వెస్ట్ .. లబోదిబోమన్న యజమాని

కాసు చేరాలు పెంచుకున్న కుక్క చేసిన పని తెలిసిన గ్రామ సర్పంచ్ ఈ విషయాన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా గ్రామంలో అందరికీ తెలిసేలాగా షేర్ చేశారు. ఎవరికైనా డబ్బుల సంచి దొరికితే తిరిగి చేరాలుకు ఇవ్వవలసిందిగా సందేశం పంపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.

కుక్క వల్ల డబ్బులు పోగొట్టుకోవడంతో సదరు యజమాని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇంటికి వచ్చిన దొంగల బారి నుండి ఇంటిని కాపాడాల్సిన కుక్క, తానే ఇంట్లో ఉన్న నగదును తీసుకువెళ్లి ఎక్కడో పడెయ్యడంతో యజమాని తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. కుక్క చేసిన పనికి వాపోవాల్సి వచ్చింది.

English summary
A shepherd named Kasu Cheralu pet dog gave shock to him. Dog has taken away one lakh fifty thousamd rupees cash bag. The incident happened in Nachinapally village in Warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X