93 ఏళ్ళ వయస్సులో పీహెచ్డీ పట్టా.. బామ్మా.. నీ స్పూర్తికి హ్యాట్సాఫ్!!

చదువుకోవాలని తపన ఉండాలి కానీ ఏ వయసులోనైనా చదువుకోవచ్చు అని నిరూపించారు ఓ బామ్మ. చదువుకోవాలన్న పట్టుదల, ఇష్టంగా చదువుకునే శ్రద్ధ ఉండాలి కానీ, చదువుకు ఏజ్ తో ప్రమేయం లేదని నిరూపించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తాజాగా జరిగిన 83వ స్నాతకోత్సవంలో 93 ఏళ్ల రేవతి ఆంగ్ల భాషలో పీహెచ్డీ పట్టా అందుకుని అందరి దృష్టిని ఒకసారిగా ఆకర్షించారు.

93 ఏళ్ళ వయసులో చదువా... అందులోనూ పీహెచ్డీ పట్టా పొందడమా అని అక్కడికి వచ్చిన వారంతా ఆ బామ్మ ని చూసి ఆశ్చర్యపోయారు. ఆమె పట్టుదలకు, చదువుపై ఆమెకున్న శ్రద్ధకు చాలామంది ఫిదా అయ్యారు. 1990 సంవత్సరంలో అధ్యాపకురాలిగా పదవీ విరమణ చేసిన ఆమె సికింద్రాబాద్లోని కిస్ ఎడ్యుకేషనల్ సొసైటీ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

PhD at the age of 93.. grandma.. Hats off to your inspiration!!

ఆంగ్ల భాషలో వ్యాకరణం, వర్ణమాల తో పాటు పదాల కూర్పు వంటి అంశాల పైన రేవతి తంగవేలు పరిశోధన చేసి పీహెచ్డీ పట్టాను అందుకున్నారు. ప్రస్తుత సమాజంలో చదవాలంటే సమయం లేదని, ఈ వయసులో చదివి ఏమిటి అని, చదవడానికి తీరిక లేదు అని రకరకాల కారణాలు చెప్పే వారికి 93 ఏళ్ల వయసులో ఈ బామ్మ చదువుకున్న తీరు చెంపపెట్టు అని చెప్పాలి.

అన్ని వసతులు సమకూర్చి చదువుకోమంటే చదువుకోని యువత ఉంటున్న నేటి రోజుల్లో, ఇలాంటి బామ్మలను వారందరికీ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజ్ఞాన సముపార్జనకు వయసుతో నిమిత్తం లేదని ఈ బామ్మ అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. 93 ఏళ్ల వయసులో ఎంత ఉత్సాహంతో ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవ వేడుకలో పీహెచ్డీ పట్టా అందుకున్న బామ్మ.. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరితోనూ శభాష్ అనిపించుకుంటున్నారు.

జీవితం చివరి అంకంలో ఉన్నప్పటికీ ఎన్ని ఆటంకాలు వచ్చినా, వయసు ఎంతైనా చదువుకోవలసిన అవసరం ఉందని, చదువుపై ఆమె చూపించిన శ్రద్ధ చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలాంటి వారే కదా మన దేశానికి కావాల్సింది.. వారే కదా మన యువతకు స్ఫూర్తి ఇవ్వాల్సింది అని ఈ విషయం తెలిసిన వారు బామ్మకు తెగ కితాబిస్తున్నారు. ఏది ఏమైనా నీ స్ఫూర్తి కి హ్యాట్సాఫ్ బామ్మ!!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+