ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్‌: నేరం అంగీకరించిన నిందితులు వారిపై లుకౌట్ నోటీసులు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ ​రావు వ్యవహారంలో ఇద్దరు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని శనివారం సుదీర్ఘంగా విచారించిన అధికారులు.. ఎస్​ఐబీలో హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసిన విషయంలో భుజంగరావు, తిరుపతన్నల పాత్ర ఉన్నట్లు గుర్తించారు.

ఏడు రోజుల కస్టడీలో భాగంగా ప్రణీత్‌రావు ఇచ్చిన వివరాల ఆధారంగా కేసులో మాజీ ఎస్​ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు(Prabhakar rao), మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఐన్యూస్ యజమాని శ్రవణ్​ల పేర్లను ఎఫ్ఐఆర్​‌లో చేర్చారు. శుక్రవారం రాత్రి నిఘా విభాగం మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు.

phone tapping case remand for Two police officers

అదే సమయంలో భుజంగరావు, తిరుపతన్న ఇళ్లలోనూ సోదాలు జరిపిన పోలీసులు.. శనివారం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు రావాలవి 41ఏ - సీఆర్​పీసీ నోటీసులు అందించారు. విచారణ అనంతరం ఇద్దరు ఏఎస్పీలను అరెస్టు చేసినట్లు వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచగా కేసు పూర్వాపరాలు, ఆధారాలు పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం నిందితులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఇది ఇలావుండగా, ట్యాపింగ్‌ వ్యవహారంలో నిఘా విభాగం మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌ రావులపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ప్రణీత్ ​రావు కస్టడీలో చెప్పిన అధికారుల పేర్లతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారేమోననే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. కస్టడీ విచారణలో ప్రణీత్ ​రావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినట్లు అంగీకరించారు. దీంతో ఎస్​ఐబీలో నోడల్ అధికారి కాకుండా ప్రణీత్‌ రావే, 'లా ఆఫ్‌ ఇంటర్సెప్షన్'లా ఫోన్‌కాల్స్‌​ను ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

మరోవైపు, చంచల్​గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న భుజంగ రావు, తిరుపతన్న తాము ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని అంగీకరించినట్లు సమాచారం. ఉన్నతాధికారి ఆదేశాల మేరకే తాము పని చేశామని, ప్రణీత్‌ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేశామని వారు అంగీకరించినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు నాగోలు మూసీ వంతెన కింద హార్డ్‌డిస్క్‌ల భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+