phone tapping case: షాకింగ్ ట్విస్ట్‌లు: వాళ్ళే టార్గెట్‌గా నల్గొండలో వార్ రూమ్!!
తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తీగలాగితే డొంకంతా కదులుతున్నట్టు ఈ కేసులో కిందిస్థాయి పోలీసులను ఏ విధంగా ఉపయోగించుకున్నారో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. ఏ జిల్లాను వదిలిపెట్టకుండా జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించి నల్గొండ లోనే వార్ రూమ్ ను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
నల్గొండ కేంద్రంగా వార్ రూమ్
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ కేసులో పాత్ర ఉన్నట్టు అనుమానిస్తున్న పలువురు టాస్క్ ఫోర్స్ పోలీసులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వార్ రూమ్ పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన ప్రణీత్ రావుతో పాటు, రాధాకిషన్ రావు తిరుపతన్న, భుజంగరావులు గతంలో ఉమ్మడి నల్గొండజిల్లాలోనే పనిచేయడంతో అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా అనుమానిస్తూ ఆ దిశలో దర్యాప్తు జరుపుతున్నారు.

మునుగోడు ఉపఎన్నికలు, గత ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్
ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో విపక్ష పార్టీ నేతల ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్టు విచారణలో తేలింది. బిజెపి అభ్యర్థిగా మునుగోడు ఉప ఎన్నికల బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి చెందిన డబ్బులు ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారానే పట్టుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.
బడా వ్యాపారులనూ వదిలిపెట్టని ఫోన్ ట్యాపింగ్
అంతేకాదు మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీని గెలిపించడం కోసం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వాళ్లీ వాహనాల్లో డబ్బులు తరలించినట్టు, కాంగ్రెస్ నేతలతో పాటు కాంగ్రెస్ ముఖ్య అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు సమాచారం. రాజకీయ నేతలు మాత్రమే కాదు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైస్ మిల్లర్లు, ఇతర పరిశ్రమ యజమానులను కూడా టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది.
అరెస్ట్ అయిన వారికి నల్గొండకు సంబంధం
నల్గొండ, మహబూబ్ నగర్ లలో బడా వ్యాపారులనూ వదిలిపెట్టని ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు వారిని కూడా డబ్బు కోసం వేధించినట్టు గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారుల బృందం గుర్తించింది. ఈ కేసులో ఇప్పటివరకు కీలకంగా అరెస్టు చేసిన వారు అందరూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంబంధం ఉన్నవారే కావడం గమనార్హం.
వణికిపోతున్న నల్గొండ పోలీసులు
ఇక నల్గొండ వార్ రూమ్ కేంద్రంగా వీరితో పాటు పనిచేసిన వారెవరు? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పోలీసులకు ఎవరెవరికి వీరితో సంబంధం ఉంది అన్న కోణంలో దర్యాప్తు జరుగుతుండడంతో నల్గొండ జిల్లా పోలీస్ బృందం ఇప్పుడు వణికిపోతోంది. ఈ కేసులో ఇంకా ఎంత మంది పేర్లు బయటకు వస్తాయో తెలియాల్సి ఉంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications