రేవంత్, బాబు ఎఫెక్ట్: టీలో వారికీ ట్యాపింగ్ భయం పట్టుకుందా?
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి అరెస్టు అనంతరం ఫోన్ ట్యాపింగ్ అంశం హాట్ హాట్‌గా మారింది. రేవంత్‌ను పట్టుకునేందుకు పటిష్టమైన ప్లాన్ వేశారు. కెమెరాలు అమర్చి, అతనిని పట్టుకున్నారు.
మరోవైపు, చంద్రబాబుదిగా చెబుతున్న ఆడియో టేప్ సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ భయం పట్టుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా లోలోన ఆ భయం పట్టుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

మిగతా పార్టీల్లోను ఆ ఆందోళన కనిపిస్తోందని అంటున్నారు. మరోవైపు, ప్రజా సంఘాల కార్యకలాపాల పైన కూడా తెరాస కన్నేసిందా? సమస్యల పోరాటాలకు సిద్ధమవుతున్న ఆయా సంఘాల నేతల ఫోన్ క్లాస్ పైన నిఘా సాగుతోందా? అంటే ఔననే వాదనలు వినిపిస్తున్నాయని ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చింది.
రేవంత్ రెడ్డితో ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ భేటీ
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌తో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications