మరో సూరత్: ఓరుగల్లుకు కేసీఆర్ వరాలు (పిక్చర్స్)

వరంగల్: వరంగల్‌ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక ఉందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇటువైపు దృష్టి సారించాలని చెబుతున్నానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. జిల్లా అభివృద్ధిపై సోమవారం ఆయన కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో వివిధ విభాగాల అధికారులతో రెండు విడతలుగా సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

వరంగల్‌ జిల్లాలో భారీ టెక్స్‌టైల్‌ పరిశ్రమ స్థాపనకు రెండు వేల ఎకరాలకు తక్కువ కాకుండా అవసరమైన స్థలాన్ని గుర్తించాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. పరిశ్రమస్థాపనకు అనువుగా ఉంటే అటవీ భూములైనా పర్వాలేదన్నారు.

నగరం చుట్టూ 73 కిలో మీటర్ల మేర ఔటర్‌రింగ్‌ రోడ్డు నిర్మాణం, ఈ రోడ్డుకు అనుసంధానం చేస్తూ నగరంలోని ప్రధాన కూడళ్ల మీదుగా అంతర్గత రోడ్ల విస్తరణ, నగర శివార్లలోని గ్రామాల లింకురోడ్ల అభివృద్ధి, కాకతీయ ఉత్సవాల నిర్వహణ అంశాలపై ప్రధానంగా చర్చించారు.

కేసీఆర్

కేసీఆర్

వరంగల్ నగరంలోని గుడిసె వాసులందరికీ 1 ప్లస్‌ 1 తరహాలో 120 గజాల స్థలంలో గృహాలు నిర్మించేలా ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. మీడియాను అనుమతించని ఈ సమీక్ష వివరాలను ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజయ్య, ఎంపీ కడియం శ్రీహరి అనంతరం విలేకరులకు తెలిపారు.

కేసీఆర్

కేసీఆర్

వరంగల్ జిల్లాలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు అంశంపై సీఎం ప్రధానంగా దృష్టి సారించారు. వరంగల్‌, కరీంనగర్‌ తదితర జిల్లాల నుంచి జనం ఎక్కువగా జీవనోపాధి కోసం సూరత్‌కు వలస వెళ్లడాన్ని గుర్తు చేశారు. పత్తి ప్రధానంగా పండించే వరంగల్‌ జిల్లాలోనే భారీ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయడం ద్వారా సూరత్‌నే ఇక్కడికి రప్పిద్దామని ఆయన ఆకాంక్షించారు. ఇందుకు రెండువేల ఎకరాల భూమి కావాలని, వీలైనంత ఎక్కువ సేకరిద్దామని అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

ఆజంజాహి మిల్లుకు ప్రత్యామ్నాయంగా వేలాది మందికి ఉపాధి కల్పిద్దామని వివరించారు. ఈ పార్కు కోసం ఇప్పటికే గుర్తించిన చింతగట్టు, జయగిరి గ్రామాల మద్య ఉన్న భూమి సరిపోదని అధికారులకు సూచించారు. ధర్మసాగర్‌ మండలం దేవునూరులో 3వేల ఎకరాలు, జాకారంలో 6వేల ఎకరాలు ఉన్నట్టు అధికారులు చెప్పగా, అవి అటవీ భూములైనా నిబంధనలు పరిశీలించి టెక్స్‌టైల్‌ పార్కుకు తీసుకుందామన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

ఒకప్పటి కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు వారసత్వ నగరాల్లో ఒకటని, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ సూచించారు. దీనికి నిధుల కొరత ఏ మాత్రం అడ్డుకాదని స్పష్టం చేశారు.

 కేసీఆర్

కేసీఆర్

నగరం చుట్టూ 73 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించాలని అధికారులకు సూచించారు. కరుణపురం నుంచి ఆరెపల్లి వరకు ఉన్న 29 కిలోమీటర్ల జాతీయ రహదారితో పాటు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న 44 కిలోమీటర్ల రాష్ట్ర రహదారిని కలుపుతూ 200 అడుగుల వెడల్పుతో రెండు వరుసల రోడ్డుగా అభివృద్ధి చేయాలన్నారు. దీనికి ఆనుకొని ఉన్న గ్రామాల లింక్‌ రోడ్లను కూడా విస్తరించాలని సూచించారు. రానున్న 40 సంవత్సరాల్లో పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణం జరగాలని సూచించారు.

కేసీఆర్

కేసీఆర్


కేసీఆర్‌ తన పర్యటనలో భాగంగా జరపాల్సిన ఏరియల్‌ సర్వే చివరి నిముషంలో రద్దయింది. ఉదయం 11.30 గంటలకు నగరానికి చేరుకోవలసి ఉన్న కేసీఆర్‌ గంట ఆలస్యంగా మధ్యాహ్నం 12.20 గంటలకు వచ్చారు.

కేసీఆర్

కేసీఆర్

టెక్స్‌టైల్‌ పార్కు కోసం ప్రతిపాదించిన స్థలాలన్నీ 500 ఎకరాల్లోపు ఉండడం, అవి అంతగా సరిపోవని సమీక్షలో కేసీఆర్‌ అభిప్రాయపడడం ఏరియల్‌ సర్వే రద్దుకు కారణాలుగా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+