అపోలో వైట్ కోట్ ఉత్సవంలో సంగీత (పిక్చర్స్)
హైదరాబాద్: అనారోగ్యాన్ని నివారించడం ద్వారా సమాజం గణనీయమైన పురోభివృద్ధిని సాధించవచ్చునని అపోలో గ్రూప్ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి అభిప్రాయపడ్డారు.
అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సంస్థలో వైద్య విద్య అభ్యసించే నూతన విద్యార్థుల వైట్ కోట్ ఉత్సవాన్ని బంజారాహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలుపువర్ణంతో మెరిసిపోయే కోట్లు ధరించి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు సోమవారం నాడు సందడి చేశారు.

వైట్ కోట్
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతాప్ సి రెడ్డి, అపోలో గ్రూప్ ఆసుపత్రుల డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ సి రెడ్డి మాట్లాడారు.

వైట్ కోట్
దేశ ఆకాంక్షలను నెరవేర్చేందుకు అంకితభావం కలిగి సదా సన్నద్ధంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, ఒబెసిటీ, క్యాన్సర్, మెంటల్ డిప్రెషన్ల కారణంగా ప్రతి ఏడాది లక్షలాది మంది మృతి చెందడం బాధాకరమన్నారు.

వైట్ కోట్
జీవనశైలిని మార్చుకోవడం, నియమబద్ధ ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి లేని జీవనం, ధూమపానం, మద్యపానా్ని అరికట్టడం ద్వారా చాలా వరకు జబ్బులను నివారించవచ్చునని అభిప్రాయపడ్డారు.

వైట్ కోట్
సంగీతా రెడ్డి మాట్ల్డాతూ.. ఇటువంటి ఉత్సవం నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో విద్య పట్ల గౌరవం, అంకితభావం ఏర్పడతాయని వ్యాఖ్యానించారు.

వైట్ కోట్
తమ కళాశాలలో విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలను అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమర్థత, సమగ్రతలను పెంపొందించే రీతిలో బోధనలు ఉంటాయని సంగీతా రెడ్డి తెలిపారు.

వైట్ కోట్
అంతకుముందు కళాశాల డీన్, ప్రిన్సిపల్, అధ్యాపక బృందం చేతుల మీదుగా విద్యార్థులకు వైట్ కోట్లు ధరింప చేశారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.












Click it and Unblock the Notifications