కాంగ్రెస్ కు షాక్: BRSలో చేరిన విష్ణువర్ధన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి!!

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన అభ్యర్థులు పార్టీలు మారుతున్న ప్రస్తుత పరిస్థితులలో తాజాగా కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు పీజేఆర్ కుమారుడు విష్ణు వర్ధన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి లు.

విష్ణువర్ధన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి ఇద్దరు ఈ రోజు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు . ముఖ్యమంత్రి కెసిఆర్ బీఆర్ఎస్ భవన్లో వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వారిని హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు గా ప్రకటించారు.

PJR son Vishnuvardhan Reddy joined into BRS

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడుగా రావాలని వారిని కోరినట్టు కెసిఆర్ తెలిపారు. విష్ణువర్ధన్ రెడ్డి భవిష్యత్తుకు తాను భరోసా ఇస్తున్నట్టు కెసిఆర్ పేర్కొన్నారు. నాగం జనార్దన్ రెడ్డి, తాను అనేక పోరాటాలు చేశామని కెసిఆర్ వెల్లడించారు. పాత, కొత్త నేతలు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన ఆయన, తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని గుర్తు చేశారు.

nagam janardhan reddy joined into BRS

ఇక బీఆర్ఎస్ పార్టీలో చేరిక సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎంతకాలమో మనుగడ సాగించలేదని, ప్రస్తుత నేతలు త్వరలో గాంధీభవన్ ను కూడా అమ్మేస్తారు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తన తండ్రి పిజెఆర్, తాను ఎన్నో ఏళ్ళు సేవలు అందించామని, కానీ ప్రస్తుతం ఉన్న నేతలు డబ్బులకు అమ్ముడుపోయి తనకు అన్యాయం చేశారని విష్ణు వర్ధన్ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ నేతలకు రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏ చైనాకో, అమెరికాకో అమ్మేస్తారు అని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ ఇద్దరు నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో తమ అనుచరులతో పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్టు అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+