హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై ప్రధాని మోడీ ప్రశంసలు: ఎందుకంటే?
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మాధవీలతపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని మోడీ స్పందించారు. ఆ కార్యక్రమంలో మాధవీలత ఇచ్చిన సమాధాలు ఆకట్టుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.
'మాధవీలతా జీ.. మీ 'ఆప్ కీ అదాలత్' ఎపిసోడ్ అద్భుతంగా ఉంది. చాలా కీలక అంశాలను మీరు ఇందులో లేవనెత్తారు. అవి ఎంతో తార్కికంగా ఉన్నాయి. మీకు నా శుభాకాంక్షలు' అని ప్రధాని మోడీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. అంతేగాక, ఈ ఎపిసోడ్ ప్రసారాన్ని అందరూ చూడాలని ప్రధాని కోరారు.

Madhavi Latha Ji, your ‘Aap Ki Adalat’ episode is exceptional. You’ve made very solid points and also done so with logic and passion. My best wishes to you.
— Narendra Modi (@narendramodi) April 7, 2024
I also urge everyone to watch the repeat telecast of this programme at 10 AM or 10 PM today. You all will find it very…
కాగా, ఎలాంటి రాజకీయ నేపథ్యంలో లేకపోయిన్పటికీ కొంపెల్ల మాధవీలతకు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ను కేటాయించింది బీజేపీ. ఏఐఎంఐఎం అధినేత, ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీగా ఉన్న అసదుద్దీన్ ఒవైసీపై ఆమె పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు కేంద్రం వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. లతామా ఫౌండేషన్ ఛైర్ పర్సన్‌గా ఉన్న మాధవీలత.. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో తొమ్మిదేళ్లుగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అయితే, స్థానిక బీజేపీ నేతలకు కాకుండా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి మాధవీలతకు టికెట్ కేటాయించడం పట్ల గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తోపాటు పలువురు నేతలు వ్యతిరేకించారు. అయినప్పటికీ బీజేపీ మాత్రం మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మరోవైపు, తాను రాజా సింగ్ తోపాటు అందరు బీజేపీ నేలలను కలుపుకుని హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని బీజేపీ అభ్యర్తి మాధవీలత స్పష్టం చేవారు.












Click it and Unblock the Notifications