తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ - ముహూర్తం, రూట్, షెడ్యూల్..!!
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల మీదుగా కొత్తగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కేటాయించారు. రైల్వేలో వందేభారత్ నుంచి ప్రస్తుతం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వరకు తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కుతోంది. తమిళనాడు కేంద్రంగా మార్చి 1 న ప్రధాని మోదీ ఒకే సారి నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైలు రూట్ - షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ అందించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. మార్చి 1వ తేదీన తమిళనాడులోని మధురై వేదికగా ప్రధాని మోదీ నాలుగు కొత్త రైలు సర్వీసులను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. మంగళూరు సెంట్రల్-రామేశ్వరం-మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, తాంబరం- మంగళూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూర్-ధనాబాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు నాగర్‌కోయిల్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఒకే ముహూర్తాన ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అదే సమయంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కొత్తగా అభివృద్ది చేసిన 8 స్టేషన్లను మోదీ మార్చి 1వ తేదీన మధురై నుంచి జాతికి అంకితం చేయనున్నారు. త్వరలో తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఒకే సారి తమిళనాడు కేంద్రంగా నాలుగు రైళ్లను కేటాయించి.. వెంటనే ప్రారంభించేలా నిర్ణయం తీసుకున్నారు. తాంబరం-మంగళూరు AB ఎక్స్‌ప్రెస్ మంగళూరు జంక్షన్ నుండి వీక్లీ సర్వీసుగా ఖరారు చేసారు.

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు ప్రయోజనకరంగా
గత నెల జనవరి 27వ తేదీన ప్రారంభమైన చర్లపల్లి-తిరువనంతపురం నార్త్ వీక్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది. ఈ రైలు తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల మీదుగా రాక పోకలు సాగిస్తోంది. ఈ రైలు మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. తర్వాతి రోజు 14.45 నిమిషాలకు తిరువనంతపురం చేరుకుంటుంది. నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, చెన్నై ఎగ్మోర్, తిరూచీ, మధురై, కొల్లం స్టేషన్లలో ఇది ఆగుతుంది. ఇందులో నాన్ ఏసీ స్లీపర్, జనరల్, ప్యాంట్రీ కార్ కోచ్‌లు ఉన్నాయి. కాగా ఇప్పుడు మరో రైలు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. నాగర్‌కోయిల్-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రెండు తెలుగు రాష్ట్రాల రెగ్యులర్ రూట్ లోనే చర్లపల్లికి చేరుకునే విధంగా ఖరారు చేసారు. రైలు వేళలు.. స్టాపుల గురించి రైల్వే అధికారులు ఈ రోజు లేదా రేపు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
-
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications