రాజ్యాంగానికి స్ఫూర్తి: సమాతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ సందేశం

హైదరాబాద్: సమతా సూత్రాన్నిలోకానికి అందించిన శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో శనివారం సాయంత్రం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామి నేతృత్వంలో నిర్మించిన 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వసంత పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు. పంచలోహాలతో రూపొంది, కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహం కావడం గమనార్హం.

Recommended Video

    Statue Of Equality: Story Behind Sri Ramanujacharya Statue | PM Modi | Oneindia Telugu

    రామానుజాచార్యులు జ్ఞానం, ధ్యానానికి ప్రతీక: ప్రధాని మోడీ

    రామానుజాచార్యులు జ్ఞానం, ధ్యానానికి ప్రతీక: ప్రధాని మోడీ

    అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. జగద్గురు శ్రీ రామానుజాచార్య భారీ దివ్య రూప విగ్రహం ద్వారా భారతదేశం మానవ శక్తిని, స్ఫూర్తిని పొందుతోందని అన్నారు. రామానుజాచార్య విగ్రహం ఆయన జ్ఞానం, నిర్లిప్తత, ఆదర్శాలకు చిహ్నమని పేర్కొన్నారు. భారతదేశం అద్వైతం కూడా ఉంది. ద్వంద్వత్వం కూడా ఉంది. ఈ ద్వంద్వ-అద్వైతాలను కలుపుతూ.. శ్రీ రామానుజాచార్య విశిష్ట-ద్వైతం కూడా ఉందని మోడీ వెల్లడించారు. ఇక్కడ 108 దివ్య క్షేత్రాలను దర్శించుకున్నట్లు మోడీ తెలిపారు. దేశమంతా తిరిగి దేవాలయాలు చూసిన అనుభూతి కలిగిందని ప్రధాని అన్నారు. గురువు వల్లే మనిషి జ్ఞానం వికసిస్తుందన్నారు. రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీకగా ప్రధాని పేర్కొన్నారు.

    రామానుజాచార్యుల సమతా సూత్రం మన రాజ్యాంగానికి స్ఫూర్తి: మోడీ

    రామానుజాచార్యుల సమతా సూత్రం మన రాజ్యాంగానికి స్ఫూర్తి: మోడీ

    రామానుజుడు 11వ శతాబద్ధంలోనే మానవ కళ్యాణం గురించి ఆలోచించారన్నారు. చినజీయర్ స్వామి తనతో విశ్వక్సేనేషి యజ్ఞం చేయించారన్నారు. విశ్వక్సేనేష్టి యజ్ఞఫలం 130 కోట్ల మంది ప్రజలకు అందాలని ఆకాంక్షించారు. మనదేశంలో ద్వైతం, అద్వైతం కలిసి ఉన్నాయని తెలిపారు. రామానుజార్యుల బోధనలో వైరుధ్యం ఎప్పుడూ రాలేదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. రామానుజాచార్యులు అంధ విశ్వాసాలను పారదోలారని ప్రధాని మోడీ తెలిపారు. రామానుజుడి విశిష్టాద్వైతం మనకు ప్రేరణ, భక్తికి కులం, జాతి లేదని రామానుజాచార్యలు చాటి చెప్పారన్నారు ప్రధాని మోడీ. రామానుజాచార్యులు దళితులకు ఆలయ ప్రవేశం చేయించారని, మనిషికి జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటారన్నారు. రామానుజాచార్యుల సమతా సూత్రం మన రాజ్యాంగానికి స్ఫూర్తి అని తెలిపారు. అసమానతల నివారణకు కృషి చేసిన ఆధునిక నాయకుడు అంబేద్కర్ అని అన్నారు.

    సర్వాంగ సుందరంగా సమతా మూర్తి కేంద్రం

    పంచలోహాలతో రూపొంది, కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహం కావడం గమనార్హం. సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 ఆలయాల నిర్మాణం చేపట్టారు. సమతామూర్తి కేంద్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఎల్ఈడీ దీపాల కాంతుల్లో కేంద్రం, యాగశాలలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. ప్రత్యేకంగా బెంగళూరుతోపాటు విదేశాల నుంచి తెప్పించిన వందకుపైగా రకాల పుష్పాలతో ప్రాంగణమంతా అందంగా అలంకరించారు. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో నిర్వహించిన విశ్వక్సేనేషి యాగంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలలో ప్రధానికి.. చినజీయర్ స్వామి స్వర్ణ కంకణం కట్టారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ రామానుజాచార్యులు విగ్రహ విశేషాలు

    రామానుజాచార్య లేదా రామానుజాచార్యులు (క్రీ.శ. 1017 - 1137 ) విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ద్వితీయుడు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవునిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఓం నమోనారాయణాయ అనే అష్టాక్షరీ మహామంత్రాన్ని సకల జనులకు అందించిన ఆధ్యాత్మిక విప్లవమూర్తి భగవద్రామానులు. 11వ శతాబ్దానికి చెందిన కుల వివక్ష, పేద ధనిక తారతమ్యాలు, అసమానతలపై పోరాడిన అధ్యాత్మిక వైష్ణవ యోగి శ్రీరామానుజాచార్యుల స్మారకార్థం ఏర్పాటు చేసిన 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఈ విగ్రహం బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింక్‌ల కలయికతో 'పంచధాతు'తో తయారు చేయడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లోహ విగ్రహాలలో కూర్చొని ఉండేటటువంటి విగ్రహాలలో ఇది ఒకటి. ఇది 54 అడుగుల ఎత్తైన బేస్ భవనంపై విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చిన జీయర్ స్వామి ఆశ్రయంలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాంగణంలో శ్రీరామనుజ ఆలయంతో పాటు వేద డిజిటల్ లైబ్రరీ,పరిశోధనా కేంద్రం, ప్రాచీన భారతీయ గ్రంథాలు, థియేటర్, ఎడ్యుకేషనల్ గ్యాలరీ, ఇది సెయింట్ రామానుజాచార్య అనేక రచనల వివరాలను అందిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+