తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు ఫైనల్ - అనూహ్య ఎంపిక..!!
ప్రధానిగా మోదీ ఈ రోజు మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రివర్గం ఖరారైంది. తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి అవకాశం దక్కింది. ఏపీ నుంచి ఇద్దరు టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసానికి ఆహ్వానం అందింది. తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డితో పాటుగా బండి సంజయ్ కు అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఈ ఇద్దరు ఈ సాయంత్రం కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇద్దరికి పిలుపు
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఆయన ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేస్తారు. అయితే మోదీ తన క్యాబెనెట్‌లో ఎవరెవరికి చోటుకల్పిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీజేపీతోపాటు మిత్రపక్షాలకు చెందిన పలువురు ఎంపీలకు ఫోన్ కాల్స్ వెళ్లాయి. ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ రావాలంటూ ఆహ్వానాలు పంపారు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసానికి ఫోన్లు వచ్చాయి. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటుగా బండి సంజయ్ కు ఆహ్వానం అందింది.

కిషన్ రెడ్డితో పాటుగా బండి
తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ నుంచి ఎంపీలుగా గెలిచారు. దీంతో...చివరి వరకు ఎవరికి కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కుతుందనేది ఆసక్తిని పెంచింది. పలువురు రేసులో నిలిచారు. ఢిల్లీలోనే మకాం వేసి తమ వంత ప్రయత్నాలు చేసారు. అయితే, తొలి విడతలో కిషన్ రెడ్డి..బండి సంజయ్ పేర్లు ఖరారు చేసారు. విస్తరణలో మరో ఇద్దరికి ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా.. బండి సంజయ్ కు సహాయ మంత్రి హోదా ఇస్తారని తెలుస్తోంది. ఇక..విస్తరణలో సామాజిక సమీకరణాల ఆధారంగా మరో ఇద్దరికి ఛాన్స్ దక్కనుంది.
విస్తరణలో మరో ఇద్దరికి
మోదీ తాజా మంత్రివర్గంలో తమిళనాడు నుంచి అన్నామలై, కర్ణాటక నుంచి జేడీ కుమార స్వామికి కీలక శాఖలు దక్కనున్నాయి. జాబితాలో రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివ్‌రాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, అర్జురామ్ రామ్ మెఘ్వాల్, చిరాగ్ పాశ్వాన్, అనుప్రియా పటేల్, జీతన్ రామ్ మాంఝీ, జయంత్ చౌదరి, ఉన్నారు. వీరంతా మోదీతోపాటు ప్రమాణం చేయనున్నారు. కొత్త మంత్రులకు ప్రధాని మోదీ తేనేటి విందు ఇస్తున్నారు. చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు జరిగితే మినహా వీరంతా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications