ఆ వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్.. సినీనటి, ఎంపీ నవనీత్ కౌర్ పై పోలీస్ కేసు!!
తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు, విమర్శల పర్వాలు కొనసాగుతున్నాయి. అంతేకాదు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వివాదాస్పద వ్యాఖ్యలతో పోలీస్ కేసులు కూడా నమోదవుతున్నాయి. తాజాగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన బిజెపి నాయకురాలు నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై ఆమెపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.
నవనీత్ కౌర్ పై పోలీసులకు ఫిర్యాదు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల షాద్ నగర్ లో పర్యటించిన మహారాష్ట్ర అమరావతి ఎంపీ సినీనటి నవనీత్ కౌర్, షాద్ నగర్ కూడలిలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పాకిస్తాన్ కు వేసినట్టే అని వ్యాఖ్యానించారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నవనీత్ కౌర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదుచేసిన కాంగ్రెస్ నేతలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నవనీత్ కౌర్ పై పోలీసు కేసు నమోదు
ఎన్నికల సంఘం కూడా ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవడంతో నవనీత్ కౌర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు షాద్ నగర్ సీఐ ప్రతాప లింగం ఈ విషయాన్ని తెలియజేశారు. నవనీత్ కౌర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ డీకే అరుణకు మద్దతుగా రోడ్ షో ను నిర్వహించారు. అప్పుడే ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఎన్నికల ప్రచారంలో నవనీత్ కౌర్ వ్యాఖ్యలు
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోకు అనుమతి తీసుకున్న బాధ్యులపై కూడా కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నవనీత్ కౌర్ హైదరాబాద్లో బిజెపి అభ్యర్థిని మాధవి లత కోసం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అక్కడ కూడా ఇలానే వ్యాఖ్యలు చేశారు .
మీకు 15 నిమిషాలు కావాలి... మాకు 15 సెకండ్లు చాలు: ఓవైసీకి వార్నింగ్
అటు కాంగ్రెస్ పార్టీని ఇటు ఎంఐఎం పార్టీని టార్గెట్ చేశారు. గతంలో చోటేమియా అక్బరుద్దీన్ 15 నిమిషాలు పోలీసులు లేకుంటే తామేంటో చూపిస్తామని చెప్పారని, అయితే మీకు 15 నిమిషాలు కావాలి... మాకు 15 సెకండ్లు చాలు అంటూ వ్యాఖ్యానించారు. ఓవైసీ బ్రదర్స్ ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళ్లారో కూడా తెలియకుండా చేస్తామని ఎంఐఎం పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పాతబస్తీ మరో పాకిస్తాన్ లా మారకుండా ఉండాలంటే మాధవి లతను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications