మావోల బంద్, పోలీసుల తనిఖీలు
కరీంనగర్: మావోయిస్టుల బంద్ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పరిసరాలతో పాటు.... ముఖ్యమైన బస్టాండ్, కోర్ట్, తెలంగాణా చౌక్ చౌరస్తాల్లో బాంబ్ స్క్వాడ్ బృందం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. గతంలో మావోయిస్టుల ప్రాబల్యం బాగా ఉన్న జిల్లాగా అప్పటి అవిభక్త కరీంనగర్ ఉండగా... గత కొన్నేళ్ల నుంచీ ఆ పరిస్థితి పూర్తిగా సద్దుమణిగింది. నూతనంగా ఏర్పాటైన పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్, జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ వంటి ప్రాంతాల్లో మాత్రం పోలీసులు కాస్తా అలర్ట్ కాగా.... అవిభక్త కరీంనగర్ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లిన మంథని తూర్పుడివిజన్ లోని మహదేవపూర్, కాటారాం, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో మాత్రం పోలీసులు గత రెండురోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏటూరు నాగారం వరకూ జల్లెడ పట్టారు. మరోవైపు మహదేవపూర్ మండలంలో కాళేశ్వం గోదావరితీరం వద్ద మహారాష్ట్ర, తెలంగాణలను కలిపే బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో నిన్న రాత్రి 7 గంటల నుంచీ పోలీసులు క్షుణ్నంగా వచ్చిపోయేవారిని తనిఖీలు చేశారు. అయితే మొత్తమ్మీద మావోయిస్టుల బంద్ మాత్రం కరీంనగర్, పెద్దపెల్లి, జగిత్యాల, సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పెద్దగా ప్రభావం చూపకపోగా... బార్డర్ గ్రామాల్లో మాత్రం కాస్తా పాక్షికంగా కనిపించింది.












Click it and Unblock the Notifications